Bromance Movie Review: ఓటీటీకి వచ్చేసిన ప్రేమలు నటుడి కొత్త సినిమా.. ఎలా ఉందంటే..?

Bromance Movie Review: ఈ మధ్య మలయాళ సినిమాలు మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పిస్తున్నాయి. ఇక తాజాగా మరో మంచి కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే బ్రోమాన్స్. ప్రేమమ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ ప్రతాప్, మాథ్యూ థామస్, శ్యామ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అర్జున్ అశోకన్ , మహిమా నంబియార్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు అరుణ్ డి జోస్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 14వ తేదీన బ్రోమాన్స్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక నేటి నుంచి ఈ సినిమా సోనిలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా కథ ఏంటి.. ? ఎలా ఉంది.. ? అనేది తెలుసుకుందాం.
షింటో (శ్యామ్ మోహన్) బింటో ( మాథ్యూ థామస్) ఇద్దరు అన్నదమ్ములు. షింటో కొచ్చిలో వర్క్ చేస్తూ ఉంటాడు. అన్న అంటే తమ్ముడు బింటోకి పడదు. అతనివలనే తనకు గౌరవం లేదు అని ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఒకరోజు బింటో.. తన ఫ్రెండ్స్ తో కలిసి కూర్గ్ టూర్ కి వెళ్తాడు. అక్కడ ఉండగా.. షింటో ఫ్రెండ్ షబ్బీర్ అలీ (అర్జున్ అశోకన్) కాల్ చేసి.. అన్న కనిపించడం లేదు అని చెప్తాడు. వెంటనే బింటో.. కొచ్చికి చేరుకొని.. అన్నను వెతకడం మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కున్న సమస్యలు ఏంటి.. ? అతను కలిసిన మనుషులు ఎవరు.. ? చివరికి షింటో దొరికాడా..? షింటో కి.. ఆశిష్ బొప్పన్న కి మధ్య వైరం ఏంటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే.. ప్రతి ఒక్కరు పెద్ద అబ్బాయినే పొగడడం.. చిన్నోడినీ ప్రతిసారి పెద్దోడిని చూసి నేర్చుకోమని చెప్పడం చూస్తూనే ఉంటాం. ఈ సినిమాలో కూడా అదే చూపించారు. తెలుగులో రేసు గుర్రం సినిమాలో అన్నదమ్ముల అనుబంధం లానే ఈ అన్నదమ్ముల అనుబంధం కూడా ఉంటుంది. ఎంత అన్నను తిట్టినా.. అతడంటే ప్రాణం అని, బింటో ప్రతిసారి నిర్పిస్తూనే ఉంటాడు.
అన్న చనిపోయాడేమో అన్న ఊహా వచ్చినప్పుడల్లా.. అతను బాధ పడడం ప్రతి ఒక్కరినీ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇక అన్నయ్య ఆచూకీ తెలుసుకోవడంలో అతని మాజీ లవర్ స్నేహితుడు, ఆ అన్నయ్యకి అప్పు ఇచ్చినవాడు ఒక హ్యాకర్ ఇలా వీరందరూ కలిసి చేసిన వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది. అన్నను వెతికే క్రమంలో అతడు ఏంటి.. ? ఎన్ని తప్పులు చేశాడు.. అనేది తమ్ముడు తెలుసుకుంటాడు. సినిమా మొత్తం బోర్ కొట్టకుండా చేశాడు డైరెక్టర్. మ్యూజిక్ కూడా ఎంతో బావుంది. ఈ వారం కుటుంబంతో కలిసి బ్రోమాన్స్ చూసేయండి.