Singer Armaan Malik: మరోసారి పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్

Armaan Malik Shared Again Wedding Photos: సింగర్ అర్మాన్ మాలిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో బుట్టబొమ్మ పాటతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పాటలు పాడుతూ స్టార్ సింగర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న అర్మాన్ తాజాగా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
అయితే గతేడాదే పెళ్లి చేసుకన్నట్టు ప్రకటించని అతడు మరోసారి పెళ్లి చేసుకోవడంతో అంతా షాక్ అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్ సింగర్ అయిన ఆర్మాన్ మాలిక్ సౌత్ ఆడియన్స్‌కి కూడా సుపరిచతమే. హిందీలోనే కాదు తెలుగు, తమిళంలో పాటలు పాడుతున్నాడు. అయితే 2023 ఆగష్టులో తనకు నిశ్చితార్థం జరిగినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. యూట్యూబర్ ఆష్నాష్రాఫ్‌తో ఏడడుగులు వేయబోతున్నట్టు తెలిపాడు. అయితే ఎలాంటి ప్రకటన లేకుండానే 2024 డిసెంబర్‌లో సైలెంట్ పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయాన్ని ఆలస్యంగా వెల్లడించాడు. ఈ ఏడాది జనవరిలో పెళ్లి ఫోటోలు విడుదల చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశాడు. అయితే తాజాగా మరోసారి పెళ్లి చేసుకున్న ఫోటోలు షేర్ చేసి షాకిచ్చాడు. ఇంతకి ఈ ఏడేదే పెళ్లి ఫోటోలు షేర్ చేశాడు. మళ్లీ అప్పుడే మరోసారి పెళ్లేంటి? అంతా షాక్ అవుతున్నారు. అయితే ఈసారి తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారట. ఈ మేరకు మరోసారి వధువరులుగా ముస్తాబై ఇంట్లోనే పూల దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత తమ పెళ్లి రిజిస్టర్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోని కూడా ఆర్మాన్ తన పోస్ట్‌లో జత చేశాడు. ఈ ఫోటోల్లో ఆర్మాన్ తల్లిదండ్రులు, సోదరుడు అమాల్ మాలిక్ కూడా ఉన్నారు.
కాగా అర్మాన్ కుటుంబంలో మనస్పర్థలు ఉన్నాయంటూ కొద్ది రోజులు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అతని సోదరుడు మాల్ మాలిక్ కొద్ది రోజులు కింద తాను కుటుంబంతో విడిపోయానని, ప్రస్తుతం తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నానట్టు ఓ పోస్ట్ పెట్టాడు. అప్పటి నుంచి అర్మాన్ ఇంటిలో ఏం జరుగుతుంది, కుటుంబ గొడవలకు సంబంధించిన వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో కుటుంబంతో కలిసి ఆనందంగా మరోసారి ఆర్మాన్-ఆష్నాష్రాఫ్ పెళ్లిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక అమాల్ మాలిక్ తిరిగి ఇంట్లోకి రావడంతో ఆ ఇంటిలో సందడి నెలకొంది. అందుకోసమే అర్మాన్ పెళ్లిని మరోసారి ఇలా సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
View this post on Instagram