Last Updated:

Karthikeya-2: కార్తికేయ-2 హవా.. 30 రోజుల కలెక్షన్లు ఎంతంటే

నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ-2 మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదనే చెప్పవచ్చు. ఈ సినిమా ఇప్పుటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా. బడా చిత్రాలకు ధీటుగా దాదాపు రూ.120 కోట్ల కలెక్షన్స్ సాధించిందని చెప్తున్నారు.

Karthikeya-2: కార్తికేయ-2 హవా.. 30 రోజుల కలెక్షన్లు ఎంతంటే

Karthikeya-2: ఎడ్వెంచర్ థ్రిల్లర్ గా ఇటీవలె తెరకెక్కిన చిత్రం కార్తికేయ-2. అయితే ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఈ చిత్రం హవానే కొనసాగుతుంది. ఈ సినిమా విడుదలై నెల రోజులు కావస్తున్నా కార్తికేయ-2 క్రేజ్ మాత్రం తగ్గడం లేదనే చెప్పవచ్చు. అయితే ఈ సినిమా ఇప్పుటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా. బడా చిత్రాలకు ధీటుగా దాదాపు రూ.120 కోట్ల కలెక్షన్స్ సాధించిందని చెప్తున్నారు.

టాలీవుడ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన చిత్రం కార్తికేయ-2. ఈ సినిమా ఎన్నో వాయిదాల అనంతరం ఆగస్టు 12న విడుదలైన విషయం విధితమే. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం క్రేజ్ తగ్గలేదు. విదులైన మూడురోజుల్లోనే బ్రేక్ ఈవెన్ను పూర్తి చేసుకుని, నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. అయితే ఈ చిత్రం విడుదలయ్యి దాదాపు 30 రోజులు పూర్తి కావస్తుండగా ఇప్పుటి వరకు సుమారు రూ. 120 కోట్లు కలెక్షన్లు సాధించినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మూవీ తెలుగులోనే కాకుండా విడుద‌లైన ప్ర‌తి భాష‌లోనూ భారీ క‌లెక్షన్‌లను సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘బాహుబ‌లి’, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్‌’ చిత్రాల త‌ర్వాత ఆ స్థాయిలో హిందీ ప్రేక్ష‌కుల‌ను కార్తికేయ-2 మెప్పించిందట.

అంతేకాకుండా వెయ్యి స్క్రీన్‌ల‌లో ఈ సినిమా ముప్పై రోజులు పూర్తి చేసుకుందని చెప్తున్నారు. ఈ క్ర‌మంలో మూవీ మేక‌ర్స్ రీసెంట్ గా పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంతో నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చిందనే చెప్పాలి.

ఇదీ చదవండి: యశోద టీజర్ అవుట్.. అదరగొట్టిన సామ్..!

follow us

సంబంధిత వార్తలు