Last Updated:

Abhishek Bachchan About Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌పై అభిషేక్‌ బచ్చన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Abhishek Bachchan About Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌పై అభిషేక్‌ బచ్చన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Abhishek Bachchan Shocking Comments on Aishwarya: బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆయన నటించి లేటెస్ట్‌ మూవీ ‘ఐ వాంట్‌ టు టాక్‌’. ఈ సినిమాలో అభిషేక్‌ తండ్రి పాత్రలో కనిపించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు గానూ ఉత్తమ నటుడికి అవార్డుకు ఎంపికయ్యారు. తాజాగా ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవార్డు అందుకున్న అభిషేక్‌.. ఇదే తనకు ఫస్ట్‌ అవార్డు అన్నారు.

“ఉత్తమ నటుడిగా నేను అందుకు తొలి అవార్డు ఇదే. దీనికి అనేను అర్హుడినని భావించి నన్ను ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు. దర్శకుడు సుజిత్‌ సర్కార్‌ వల్లే ఇది సాధ్యమైంది. ఆయన వల్లే నేను గొప్పగా నటించ గలిగాను. సుజిత్‌ ఐ వాంట్‌ టాక్‌తో అద్భుతమైన సినిమా రూపొందించారు. ఇదంతా ఆయన వల్లే సాధమైంది. కాబట్టి ఈ క్రిడెట్‌ ఆయనకే దక్కుతుంది. ఈ సినిమాలో నా కూతుళ్లుగా నటించిన అహిల్య, పెరల్‌లతో ఈ అవార్డును పంచుకుంటాను” అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం ఈ ఈవెంట్‌ హోస్ట్‌గా వ్యవహరించిన హీరో, నటుడు అర్జున్‌ కపూర్‌ అభిషేక్‌ను ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు.

ఆయన నటించిన ‘ఐ వాంట్‌ టు టాక్‌’ టైటిల్‌పైనే ఓ ప్రశ్న అడిగాడు. ‘నేను మీతో మాట్లాడాలి’ అని ఎవరి నుంచి ఫోన్‌ వస్తే మీరు కంగారు పడతారు అని అభిషేక్‌ని ప్రశ్నించాడు. దీనికి అతడు స్పందిస్తూ.. “నీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. ఇంకా ఎవరని అడుగుతున్నావు. నీకూ పెళ్లై ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం తెలిసేది. భార్య ఫోన్‌ చేసి నీతో మాట్లాడాలి అంటే అప్పుడే అసలైన టెన్షన్‌ వస్తుంది. ఆ ఫోన్‌ కాల్స్‌ చాలా ఒత్తిడికి గురి చేస్తాయి” అని చమత్కరించాడు. ఇలా భార్య ఐశ్వర్య రాయ్‌ నుంచి ఫోన్‌ వస్తే ఒత్తిడికి గురవుతానని చెప్పకనే చెప్పాడు అభిషేక్‌. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ హాట్‌టాపిక్‌గా మారాయి.

కాగా ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు విడాకులు తీసుకుంటున్నారంటూ కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. గతేడాది అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లికి ఐశ్వర్య, ఆరాధ్యలు, బచ్చన్‌ ఫ్యామిలీ వేరు వేరుకు ఈ కార్యక్రమానికి హాజరైంది. దీంతో అభిషేక్‌, ఐశ్వర్యలు విడిపోయారంటూ వార్తలు గుప్పమన్నాయి. ఇప్పటికే వారు విడి విడిగా జీవిస్తున్నారంటూ బి-టౌన్‌లో గుసగుసల వినిపించాయి. ఈ నేపథ్యంలో అభిషేక్‌ తమ విడాకుల వార్తలు ఖండించారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఎలా సృష్టిస్తారని మండిపడ్డాడు.