Last Updated:

Horoscope Today :రాశి ఫలాలు( గురువారం  అక్టోబర్  27, 2022)

ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.మీరు ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడుపుతారు.ఈ రోజు ఈ రాశికి చెందినవారు  సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలా చేయటం వలన  మీ మధ్య   సంబంధ  బాంధవ్యాలు  కూడా  పెరుగుతాయి.ఈ రోజు  మంచి  ఆహారంతో పాటు కొంత ప్రశాంతత కూడా దొరుకుతుంది.   

Horoscope Today :రాశి ఫలాలు( గురువారం  అక్టోబర్  27, 2022)

Horoscope Today :రాశి ఫలాలు( గురువారం  అక్టోబర్  27, 2022)

1. మేష రాశి

ఈ రోజు మీతో మీరు సమయాన్ని గడుపుతారు.మీ ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీకు బాగా కలిసి రానుంది. ఈ రోజు ప్రేమ ప్రయాణం మొదలుకాబోతోంది.ఒక సందర్భంలో ఎవరు మీ వాళ్ళో, ఎవరు పరాయి వారో ఈ రోజు తెలిసి వస్తుంది. ఇతరులను మెప్పించడం వలన  నిజంగా ఈ రోజు  మంచి లాభాలను పొందుతారు.ఈ రోజు  మంచి  రాత్రి  భోజనం, మంచి రాత్రి  నిద్ర కలగనుంది. ఈ రోజు మీకు మీ వైవాహిక జీవితం అందంగా మారబోతుంది.

2. వృషభ రాశి

జీవితం గురించి  ఆలోచించి అడుగు వేయండి.   ఖర్చులు తెలియకుండా వచ్చేస్తాయి.డబ్బును సంపాదించాలి.మీ యొక్క ఆర్ధిక పరిస్థితులు ఎక్కువ అవుతాయి.మీ ఖాళీ సమయాన్ని మీ కోసం కేటాయించుకుంటారు.ఒత్తిడి తగ్గించుకోవాడానికి వ్యాయామాలు చేయాలిసి వస్తుంది.ఈ రోజు మీరు ఖాళి సమయాన్ని  ఇప్పటివరకు మీరు చేయని పనులను  పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామికు, మీకు గొడవ జరుగుతుంది.దాంతో  రోజంతా అదే ఆలోచిస్తారు.

3. మిథున రాశి

కొత్త ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు వస్తాయి.పని ఎంత వరకు చేయాలో అంతే చేయండి మితి మీరిన పని చేయడం వల్ల అలసట, నీరసంగా ఐపోతారు.మీ ప్రేమ ప్రయాణాన్ని మీరే మొదలు పెడతారు.చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచి రోజు. ఈ రోజు  మీ కొరకు మీకు మీ  సమయము దొరకడం చాలా  కష్టమవుతుంది.కానీ మీ  అదృష్టం బావుండి   మీకు  సమయము దొరుకుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో  సంతోషంగా గడుపుతారు.

4. కర్కాటక రాశి

ఈ రోజు హుషారుగా మీ పని మీరు చేసుకుంటారు. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.మీరు కన్న కలలు నెరవేరతాయి.ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి.మీ జీవిత భాగస్వామితో కొంచం జాగ్రత్తగా ఉండండి.

5. సింహ రాశి

చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.మీ వస్తువులను ఈ రోజు జాగ్రతగా పెట్టుకోండి లేకపోతే దొంగిలించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం చేయాలిసి ఉంటుంది. ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికు మధ్య గొడవలు జరుగుతాయి.

6. కన్యా రాశి

మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు.ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది.మీకు  ఈ రోజు  మరొక అతిశక్తివంతమైన రోజు,మీరు ఎప్పుడు చూడని  లాభాలు చూడనున్నారు.  ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఎవరైతే చాలారోజుల నుంచి  తీరికలేకుండా కష్టపడుతున్నారో  గడుపుతున్నారో  వారికి  ఈ రోజు కావలిసిన సమయము దొరుకుతుంది మరియు వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి

మీ ప్రవర్తన అందరిని ఆకట్టుకుంటుంది.మీ బంధువులతో మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండండి.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. అవుతాయి.ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.పెళ్ళి గురించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. రోజు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

8. వృశ్చిక రాశి

ఆర్ధిక సమస్యలు అధికం అవుతాయి.మీ సమయాన్ని మీ తల్లిదండ్రులకు కేటాయించాలిసి ఉంది.మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతోంది.అతిగా దేని మీద ఆశలు పెట్టుకోకండి. ఈ రోజు మీ అమ్మ గారిని చాలా మిస్ అవుతారు. ఈ రోజు మీ భాగస్వామి మీ మీద అలుగుతుంది.

9. ధనస్సు రాశి

కుటుంబ ఖర్చులు అధికం అవుతాయి. మీరు అనుకున్న దానికంటే మీ జీవితం చాలా బావుంటుంది.మీరు కన్న కలలు నిజం చేసుకోవడానికి ఇదే మంచి సమయం.తల్లిదండ్రులుకు మీ సమయాన్ని కేటాయించాలి.ఈ రోజు మీకు కలిసి వస్తుంది.మీ వైహహిక జీవితం మీకు నచ్చినట్టుగా మారుతుంది.

10. మకర రాశి

బాధలు మీకే వచ్చాయని బాధ పడకండి..ఈ సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండండి.మీరు పని చేసే ఆఫీసులో ఒత్తిడి ఎక్కువుతుంది.ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీ దగ్గరికి తిరిగి వస్తుంది. డబ్బును అనవసరంగా ఖర్చు చేయకండి.మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.ఈ రోజు మీ సమయాన్ని వృధా చేస్తారు.

11. కుంభ రాశి

చెడు అలవాట్లను మానుకోండి.అనవసరంగా ఖర్చులు పెట్టకండి.ఈ రాశికి చెందిన వారు డబ్బు విలువ మీరు తొందరలోనే తెలుసుకోనున్నారు.మీకుటుంభంలోని చిన్న పిల్లలను దగ్గరికి తీసుకోండి.మీ సమయాన్ని మీ కుటుంబానికి ఇవ్వాలిసి ఉంటుంది.అనుకోకుండా  ప్రయాణాలు చేయాలిసి ఉంటుంది. మీరు ప్రయాణం చేసిన  వెంటనే ఫలితాలను తీసుకుని రాదు, కానీ భవిష్యత్  ప్రయోజనాలకు  పునాది వేస్తుంది.ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి.

12. మీన రాశి

ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది.మీరు ఎంత బిజీగా ఉన్నా మీతో మీరు సమయాన్ని గడుపుతారు.ఈ రోజు ఈ రాశికి చెందినవారు  సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలా చేయటం వలన  మీ మధ్య   సంబంధ  బాంధవ్యాలు  కూడా  పెరుగుతాయి.ఈ రోజు  మంచి  ఆహారంతో పాటు కొంత ప్రశాంతత కూడా దొరుకుతుంది.

ఇవి కూడా చదవండి: