Home / క్రైమ్
సికింద్రాబాద్ నేరేడ్ మెట్ పరిధిలో దారుణం జరిగింది. కాచిగూడలో ఉండే మైనర్ బాలికను ట్రాప్ చేసి.. నేరేడ్ మెట్ కు తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధమే హత్యకు దారితీసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది. 42ఏళ్ల మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను నిందితులు చంపేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో చంపి పాతి పెట్టినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం.
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూపాదేవి నిన్న సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌పై వేటు పడింది. ఎస్సై భవానీసేన్‌ను డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సై భవానీసేన్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు.
కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించిన ఘటన హర్యానాలోని పానిపట్‌లో జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
కృష్ణా జిల్లా పెడన మండలం కృత్తివెన్ను వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు ఓ దర్మార్గుడు. కాట్నపల్లి మమత రైస్‌మిల్‌లో ఈఘటన చోటు చేసుకుంది.
మోష్ పబ్ ద్వారా వెలుగులోకి వచ్చిన చీటింగ్ కేసును ఛేదించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు ముఠా గ్రూప్‌గా ఫామ్ అయ్యారన్నారు. యువతులను ఎరవేసి యువకులను ట్రాప్ చేసి వారి పేర్లను మార్చి డేటింగ్ సైట్స్‌లో ఫోటోస్ పెట్టి చాట్ చేసినట్లు వెల్లడించారు.
ఆస్తి కోసం మామను హత్య చేయించింది కోడలు. రూ.300 కోట్ల ఆస్తి దక్కించుకునేందుకు ఆమె రూ.1 కోటి సుపారి ఇచ్చి చంపింది. ఇక కోడలు విషయానికి వస్తే ఆమె సాదా సీదా మహిళ కూడా కాదు. టౌన్ ప్లానింగ్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్. ప్రస్తుతం ఆమె కటకటాల పాలైంది. దీనికి సంబంధించిన వివరాలివి..
కర్నూలు జిల్లా వెల్దురి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టిడిపి నాయకుడు గిరినాథ్ చౌదరిని దారుణంగా హత్య చేశారు. ఆయన సోదరుడు కళ్యాణ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.