Home / క్రైమ్
మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం చౌరస్తా వద్ద హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని మరో లారీని ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా 100 కు పైగా మేకలు కూడా చనిపోయాయి.నాగ్‌పూర్‌కు చెందిన డ్రైవర్ శుక్లాల్ మినహా మరణించిన మరియు గాయపడిన వారందరూ మధ్యప్రదేశ్ కు చెందిన వారని తెలుస్తోంది
రియల్ ఎస్టేట్ పేరిట మోసాలకు పాల్పడిన ఇద్దరినీ సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. వెంచర్లు వేస్తూ అమాయకులను బురిడీ కొట్టించారు. శుభోదయం కాకతీయ ఇన్ఫ్రా పేరిట వెంచర్లు వేశామని, అందులో పెట్టుబడులు పెట్టాలని పలువురిని నమ్మించారు.
విజయవాడలో దారుణం జరిగింది. చదువుకుంటోన్న కుమార్తె జోలికి రావొద్దని హెచ్చరించడమే పాపమైంది. నడిరోడ్డుపై కిరాతకంగా నరికి ప్రాణాలు తీశాడు. నిన్నరాత్రి పొద్దుపోయాక ఈ దారుణం జరిగింది. కుమార్తె కళ్లెదుటే ఆ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధి అంబేద్కర్ నగర్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , మాజీ ఎంపిటిసి గడ్డం మహేష్ హత్య కేసులో ఘట్ కేసర్ పోలీసులు పురోగతి సాధించారు.
సికింద్రాబాద్ నేరేడ్ మెట్ పరిధిలో దారుణం జరిగింది. కాచిగూడలో ఉండే మైనర్ బాలికను ట్రాప్ చేసి.. నేరేడ్ మెట్ కు తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధమే హత్యకు దారితీసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది. 42ఏళ్ల మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను నిందితులు చంపేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో చంపి పాతి పెట్టినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం.
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య రూపాదేవి నిన్న సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్సై భవానీసేన్‌పై వేటు పడింది. ఎస్సై భవానీసేన్‌ను డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సై భవానీసేన్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు.
కట్టుకున్న భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపించిన ఘటన హర్యానాలోని పానిపట్‌లో జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
కృష్ణా జిల్లా పెడన మండలం కృత్తివెన్ను వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఆరుగురు స్పాట్లోనే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి