Realtor Murder Sister: బీమా డబ్బుల కోసం సొంత చెల్లినే చంపేశాడు.. చివరికి ఏమైందంటే!
Realtor murdering divorced sister for insurance money: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏకంగా సొంత చెల్లిని హత్య చేశాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని కాటూరివారిపాలెంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని కనిగిరి మండలంలోని పునుగోడుకు చెందిన సంధ్య, అశోక్ కుమార్ అన్నాచెల్లెలు. అయితే సంధ్యను వివాహం కాగా, పిల్లలు పుట్టకపోవడంతో తన భర్త వదిలేశాడు. దీంతో అప్పటినుంచి సంధ్య తన పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటోంది. అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో తన చెల్లెలు సంధ్య పేరుతో రూ.1.13 కోట్లు ఇన్సూరెన్స్ చేయించాడు. ఎలాగైనా ఇన్సూరెన్స్ క్లైమ్ చేయించుకోవాలనే ఉద్ధేశంతో భారీ స్కెచ్ వేశాడు.
రియల్ ఎస్టేట్‌లో నష్టం రావడంతో పాటు అప్పులు పెరిగిపోయాయి. ఈ క్రమంలో సంధ్యకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఇదే అదునుగా భావించిన అశోక్ రెడ్డి.. ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగివస్తుండగా వైద్యులు ఇచ్చిన మాత్రలు కాకుండా నిద్ర మాత్రలు ఇచ్చాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత సంధ్య నిద్రలోకి జారుకున్న వెంటనే కాటూరివారిపాలెం సమీపంలో కారును పక్కకు నిలిపి దిండు సహాయంతో గొంతునులిమి చంపేశాడు.
ఇక, హత్య చేసినట్లు ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు కారును పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టి రోడ్డు యాక్సిడెంట్‌గా క్రియేట్ చేశాడు. ఈ ప్రమాదంలో అశోక్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కానీ తన చెల్లెలు చనిపోయినట్లు నాటకం ఆడాడు. అనంతరం తన స్నేహితుడు మాల కొండారెడ్డి సహాయంతో కోరాడు. అయితే రిపోర్టులో నిజాలు తెలుస్తాయని చెప్పడంతో ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ పనిచేస్తున్న యూసఫ్‌తో మాట్లాడి అవయవాలను మార్చేందుకు రూ.3లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు.
ఇదిలా ఉండగా, వైద్యులకు అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అశోక్ రెడ్డిపై పోలీసులు నిఘా పెట్టగా. .అసలు విషయం బయటపడింది. ముఖ్యంగా సంధ్యకు గాయాలు లేకపోవడంతో పాటు పోస్టు మార్టం విషయంలో అశోక్ రెడ్డి వైద్యులను ఒత్తిడికి గురిచేశాడు. పోలీసులు మరింత నిఘా పెట్టి విచారించగా నిజాలు చెప్పేశాడు. ఈ ఘటన ఏడాది కిందట జరగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.