Home / క్రైమ్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు ఓ దర్మార్గుడు. కాట్నపల్లి మమత రైస్‌మిల్‌లో ఈఘటన చోటు చేసుకుంది.
మోష్ పబ్ ద్వారా వెలుగులోకి వచ్చిన చీటింగ్ కేసును ఛేదించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు ముఠా గ్రూప్‌గా ఫామ్ అయ్యారన్నారు. యువతులను ఎరవేసి యువకులను ట్రాప్ చేసి వారి పేర్లను మార్చి డేటింగ్ సైట్స్‌లో ఫోటోస్ పెట్టి చాట్ చేసినట్లు వెల్లడించారు.
ఆస్తి కోసం మామను హత్య చేయించింది కోడలు. రూ.300 కోట్ల ఆస్తి దక్కించుకునేందుకు ఆమె రూ.1 కోటి సుపారి ఇచ్చి చంపింది. ఇక కోడలు విషయానికి వస్తే ఆమె సాదా సీదా మహిళ కూడా కాదు. టౌన్ ప్లానింగ్ డిపార్టుమెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్. ప్రస్తుతం ఆమె కటకటాల పాలైంది. దీనికి సంబంధించిన వివరాలివి..
కర్నూలు జిల్లా వెల్దురి మండలం బొమ్మిరెడ్డిపల్లె గ్రామంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టిడిపి నాయకుడు గిరినాథ్ చౌదరిని దారుణంగా హత్య చేశారు. ఆయన సోదరుడు కళ్యాణ్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.
రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది . జిల్లాలోని రాయచోటిలో ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వేదవతి తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది.
విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది . విహారయాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సముద్రుని రాక్షస ఆలా మృత్యువు రూపంలో దూసుకువచ్చి అక్కా చెల్లెళ్లను బలి తీసుకుంది. తమ విహార యాత్ర జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి తీరాన్ని ఆనుకొని ఉన్న కొండరాళ్లపై నిలుచుని ఫొటో తీసుకోవడానికి వెళ్లిన అక్క చెల్లెళ్ళ ను వేగంగా దూసుకొచ్చిన అల బలి తీసుకుంది.
ఏపీలోని బాపట్ల శివారు నల్లమడ వాగులో ఈతకు దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి సూర్యలంక వచ్చిన వీరు మధ్యల నల్లమడ వాగులో ఈతకు దిగినపుడు ఈ దుర్ఘటన జరిగింది.
అంతర్రాష్ట్ర పిల్లల అక్రమరవాణా ముఠా గుట్టును హైదరాబాద్ లోని మేడిపల్లి పోలీసులు రట్టు చేసారు. . ఈ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 13 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు రాచకొండ కమిషనరేట్ పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠాల కోసం గాలింపు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ కమీషనర్ తరుణ్ జోషి మీడియాకు వెల్లడించారు.
రోజు రోజుకూ సైబర్ నేరగాళ్ళు ఆగడాలు మీతిమీరి పోతున్నాయి. పోలీసు శాఖ, బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా.. ఏదో ఒకచోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన బిల్డర్ కుప్పాల మధు (48) కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 24న చింతల్ లో అదశ్యమయిన మధు బీదర్ లో హత్యకు గురయ్యారు. మధు దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు, విలువైన అభరణాలు మాయం అయినట్లు సమాచారం.