Munugode by poll: ఫలితాలు ఆలస్యంపై సీఈవో వివరణ..
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు
CEO Vikas Raj: మునుగోడు ఉప ఎన్నికల రౌండ్ వారీ ఫలితాల్లో జాప్యంపై భాజపా అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవన్నారు. 47 మంది అభ్యర్థులు ఉన్నందున ఎక్కువ సమయం పడుతోంది. ప్రతి టేబుల్ వద్ద అబ్జర్వర్లు, ఏజెంట్లు ఉన్నారు. జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తాం అని సీఈవో చెప్పారు. కాగా మొత్తం ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాసకు 32,605, భాజపాకు 30,974, కాంగ్రెస్‌కు 7,380 ఓట్లు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Munugode by poll: మునుగోడు ఉప ఎన్నికల ఓటింగ్ లో రికార్డు..