Vivo V50 5G Pre Booking: ఏఐ ఫోటోగ్రఫీ ఫీచర్స్‌తో వచ్చేస్తున్న వివో.. ముందుగా బుక్ చేస్తే భారీగా డిస్కౌంట్లు.. వేలల్లో ఆదా చేసుకోవచ్చు..!
![Vivo V50 5G Pre Booking: ఏఐ ఫోటోగ్రఫీ ఫీచర్స్‌తో వచ్చేస్తున్న వివో.. ముందుగా బుక్ చేస్తే భారీగా డిస్కౌంట్లు.. వేలల్లో ఆదా చేసుకోవచ్చు..!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/Untitled-1-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-68.gif)
Vivo V50 5G Pre Booking: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Vivo V50 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ అధికారికంగా ప్రారంభించనుంది. లాంచ్ తర్వాత, స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. దేశంలో ప్రీ-బుకింగ్ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్ల తెలుసుకుందాం.
Vivo V50 5G Pre Booking
Vivo V50 5G ప్రీ-బుకింగ్ ఆఫర్ ఫిబ్రవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రాబోయే Vivo V50 5Gని ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లు కేవలం రూ. 999కి 1-సంవత్సరం వారంటీ, 1-సంవత్సరం స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ (V-షీల్డ్)తో సహా కాంబో ఆఫర్ లభిస్తుంది. ప్రీ-బుకింగ్ ఆఫర్‌తో మీరు రూ.30,000 నుండి రూ.40,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
Vivo V50 5G Price
Vivo V50 5G మొబైల్ ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ధరపై కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే, Vivo V40 5G మొబైల్ భారతదేశంలో రూ. 34,999కి విడుదల అవుతునట్లు తెలుస్తుంది. Vivo V50 5G ఫోన్ ధర కూడా ఇదే విధంగా ఉండవచ్చు. అంటే Vivo V50 5G ఫోన్ భారతదేశంలో రూ. 37,999కి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్ రోజ్ రెడ్, టైటానియం గ్రే, స్టార్రీ బ్లూ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
Vivo V50 5G Features
Vivo V50 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల డిస్ప్లే ఉంటుంది. దీనిలో మైక్రో క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే ఉంది. 2800 × 1260 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ డిస్ప్లే Vivo X200 Pro మాదిరిగానే ఉంటుంది. Vivo X200 Pro ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 4500 నిట్ల బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది.
Vivo V50 5G ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ Android 15 ఆధారంగా Funtouch OS 15తో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12GB RAM+512GB స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. మొబైల్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్లో OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది.
ఇందులో 50 మెగాపిక్సెల్ సెకండరీ (అల్ట్రా వైడ్ లెన్స్) కెమెరా కూడా ఉంది. ఇది ఆరా లైట్ LED ఫ్లాష్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఆటో ఫోకస్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ 6,000mAh బ్యాటరీతో విడుదల అవుతుందని చెబుతున్నారు.
ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. మొబైల్లో AI- పవర్డ్ ఇమేజ్ ఎడిటింగ్, ఆడియో ట్రాన్స్క్రిప్షన్, రియల్ టైమ్ కాల్ ట్రాన్స్లేషన్ వంటి అనేక ఫీచర్లు ఉంటాయి. కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్ 4G VoLTE, 5G, Wi-Fi, GPS, బ్లూటూత్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.