iPhone 14 Offers: ఆపిల్ లవర్స్‌కు సూపర్ ఆఫర్.. భారీగా పడిపోయిన ఐఫోన్ 14 ప్రైస్.. త్వరపడండి..!
![iPhone 14 Offers: ఆపిల్ లవర్స్‌కు సూపర్ ఆఫర్.. భారీగా పడిపోయిన ఐఫోన్ 14 ప్రైస్.. త్వరపడండి..!](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/Untitled-1-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-Recovered-54.gif)
iPhone 14 Offers: చాలా మంది ఇండియన్స్ ఐఫోన్‌ను కొనడం కలగా భావిస్తారు. కానీ, అందరు కొనలేకపోతున్నారు. ఎందుకే ఐఫోన్ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో సామాన్యులు ఐఫోన్లను కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆపిల్ మొబైల్ లవర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అక్టోబర్‌లో కంపెనీ కొత్త ఐఫోన్ సిరీస్‌ను లాంచ్ చేయవచ్చు. ఇప్పటికే పాత మోడళ్ల ధరలు భారీగా తగ్గాయి. మీరు ఈ సమయంలో అతి తక్కువ ధరకు iPhone 14 512GBని కొనుగోలు చేయవచ్చు.
iPhone 14 Price Drop
ఐఫోన్ 16 సిరీస్ వచ్చిన తర్వాత ఐఫోన్ 14 సిరీస్ ధర తగ్గడం ప్రారంభమైంది. ఇప్పుడు మీరు ఈ సిరీస్‌కు చెందిన iPhone 14 256GB, iPhone 14 Plus 256GBని ఇప్పటి వరకు అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు మీకు పెద్ద స్టోరేజ్‌తో iPhone 14 512GBపై భారీ తగ్గింపు కూడా కనిపిస్తుంది.
అమెజాన్ ఐఫోన్ 14 512 జీబీ ధరను భారీగా తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 99,900కి అందుబాటులో ఉంది. అయితే అమెజాన్ తన కస్టమర్లకు 28శాతం భారీ తగ్గింపును ఇస్తోంది. iPhone 14 512GBపై 28శాతం ధర తగ్గింపు తర్వాత, మీరు దానిని కేవలం రూ.71,900కి కొనుగోలు చేయవచ్చు. ఇది కేవలం ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ మాత్రమే కానీ మీరు ఇతర ఆఫర్‌లను మిళితం చేసి చాలా తక్కువ ధరకు ఇంటికి తీసుకెళ్లచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై అమెజాన్ కస్టమర్‌లకు రూ. 2000 వరకు తక్షణ తగ్గింపును ఇస్తోంది. ఇది కాకుండా, మీరు బ్యాంక్ ఆఫర్‌లో రూ. 2157 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. మీరు ఈ ఐఫోన్‌ను రూ. 20 వేల లోపే కొనుగోలు చేయవచ్చు కానీ దీని కోసం మీరు కొన్ని షరతులు పాటించాలి.
ఐఫోన్ 14 512జీబీని రూ.20 వేల లోపే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కూడా వినియోగదారులకు కల్పిస్తోంది. ఈ ఫోన్‌పై కస్టమర్లకు కంపెనీ బలమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది. మీరు మీ పాత ఫోన్‌ను రూ.53,200 వరకు మార్చుకోవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పూర్తి విలువను పొందినట్లయితే, మీరు iPhone 14 512GBని కేవలం రూ. 18,700కి కొనుగోలు చేయవచ్చు. అయితే, మీరు ఎంత మార్పిడి విలువను పొందుతారు అనేది పాత ఫోన్ స్థితిపై ఆధారపడి ఉంటుంది.