2025 Renault Duster: భారత్ రోడ్లపైకి మళ్లీ వస్తున్న డస్టర్.. బడ్జెట్ రెడీ చేస్కోండి.. ఎంట్రీ మామూలుగా ఉండదు..!
2025 Renault Duster: రెనాల్ట్ సరికొత్త డస్టర్‌ను ఈ నెలలో జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనున్నారు. ఈ వాహనం చాలా కాలంగా భారత దేశానికి రావాలని ఎదురుచూస్తుంది. గత సంవత్సరం 2024 పారిస్ మోటర్ షోలో డాసియా, ఆల్పైన్, మొబిలైజ్, రెనాల్ట్ ప్రో ప్లస్‌తో సహా అన్ని గ్రూప్ బ్రాండ్‌లు ఈవెంట్‌లో కొత్త కార్లను ఆవిష్కరించనున్నట్లు రెనాల్ట్ తెలిపింది. గ్రూప్ 7 ప్రపంచ ప్రీమియర్లను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సారి చాలా చర్చనీయాంశం అయిన విషయం ఏమిటంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్న డస్టర్.
కొత్త రెనాల్ట్ డస్టర్‌ను 5, 7 సీట్ల ఎంపికలలో తీసుకురావచ్చు. ఇది దాని మునుపటి మోడల్ కంటే పెద్దదిగా ఉండచ్చు. దీనిని సి సెగ్మెంట్‌లోకి తీసుకురానున్నారు. ఇది 2024 పారిస్ మోటార్ షోలో మొదటిసారి ప్రదర్శించనున్నారు. రెనాల్ట్ డాసియా బ్రాండ్ కొత్త SUV కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించింది.
7 సీట్ల మారుతి ఎర్టిగా, కియా కేరెన్స్ భారతదేశంలో ఎక్కువగా సేల్ అయింది. ట్రైబర్ స్థానంలో కంపెనీ ఇప్పుడు డస్టర్‌ను మార్కెట్లోకి విడుదల చేయగలదని నమ్ముతారు. డస్టర్ అనే పేరు బాగా పాపులర్ అయినందున వాస్తవానికి కంపెనీ దీన్ని చేయగలదు. ప్రస్తుతం భారతదేశంలో 7 సీట్ల కార్లకు చాలా డిమాండ్ ఉంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం లేదు.
కొత్త డస్టర్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈసారి కొత్త డస్టర్‌లో చాలా కొత్తదనం కనిపిస్తుంది. ఈసారి కొత్త మోడల్‌లో చాలా పెద్ద మార్పులు కనిపించబోతున్నాయి. దాని ముందు భాగంలో కొత్త గ్రిల్, కొత్త బానెట్, బంపర్ కూడా కనిపిస్తాయి. అంతే కాదు దీని సైడ్ ప్రొఫైల్, రియర్ లుక్ పూర్తిగా మారిపోతుంది. కొత్త డస్టర్ ఇంటీరియర్ ఇప్పుడు మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. కొత్త ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి.
కొత్త డస్టర్‌ను 1.0L, 1.2L, 1.5L హైబ్రిడ్ ఇంజన్‌లలో విడుదల చేయచ్చు. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సర్ఫేస్ EBD, క్రూయిజ్ కంట్రోల్, లెవల్ 2 ADAS ఉన్నాయి. కొత్త డస్టర్ 5, 7 సీట్ల ఆప్షన్లలో రానుంది. డస్టర్ ధర రూ. 8 లక్షల నుంచి మొదలవుతుంది.
కొత్త డస్టర్ నేరుగా మారుతి బ్రెజ్జాతో పోటీ పడనుంది. ఈ SUV లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది 103 బిహెచ్‌పి పవర్, 137 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని పొందుతుంది. మైలేజీ గురించి చెప్పాలంటే ఈ వాహనం మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో 20.15kmpl, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 19.80kmpl మైలేజీని ఇస్తుంది. ఇందులో హైబ్రిడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.34 లక్షలు.