Hyundai Creta Sales: ఆగమాగం చేస్తున్న హ్యుందాయ్.. దుమ్మురేపుతున్న క్రెటా సేల్స్.. ఒక్కసారి ఈ రిపోర్ట్ చూడండి..!

Hyundai Creta Sales: హ్యుందాయ్ క్రెటా ఒక నమ్మకమైన ఎస్‌యూవీ. ఇది మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. అందుకనుగుణంగానే కస్టమర్లకు కూడా ఈ కారును కస్టమర్లు కొంటున్నారు. ఇటీవల ప్రధాన వాహన తయారీ కంపెనీలు ఫిబ్రవరి నెలలో తమ విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో రెండవ స్థానంలో నిలిచింది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ (21,461 యూనిట్లు) మొదటి స్థానంలో ఉంది.
గత నెల (ఫిబ్రవరి – 2025), హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం 16,317 క్రెటా ఎస్‌యూవీలను విక్రయించింది. 2024లో ఇదే నెలలో విక్రయించిన 15,276 యూనిట్లతో పోలిస్తే, సంవత్సరానికి (YoY) వృద్ధి 7శాతం. ఈ జనవరిలో కూడా 18,522 క్రెటా ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.
2024 ద్వితీయార్థంలో కూడా, హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ రికార్డు సంఖ్యలో అమ్ముడయ్యాయి. డిసెంబర్‌లో 12,608 యూనిట్లు, నవంబర్‌లో 15,452 యూనిట్లు, అక్టోబర్‌లో 17,497 యూనిట్లు, సెప్టెంబర్‌లో 15,902 యూనిట్లు విజయవంతంగా అమ్ముడయ్యాయి. ఇటీవల, అదే క్రెటా ఎస్‌యూవీ వివిధ వేరియంట్‌ల ధర రూ.13,000 వరకు పెరిగింది.
ఈ కారు ధర రూ.11 లక్షల నుండి రూ.20.42 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది E, EX, S, S(O), SXతో సహా 7 ఆకర్షణీయమైన వేరియంట్‌ల ఎంపికలో కూడా అందుబాటులో ఉంది. అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే వంటి అనేక రంగులలో అందుబాటులో ఉంది. కారులో 1.5-లీటర్ నాచులర్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 17.4 నుండి 21.8 kmpl మైలేజీని అందిస్తుంది. ఇది 5-సీటర్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి 433 లీటర్ల బూట్ స్పేస్ ఉంది.
కొత్త క్రెటా ఎస్‌యూవీలో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ ఏసీ, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. భద్రత విషయానికి వస్తే 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఉన్నాయి.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ధర రూ. 17.99 లక్షల నుండి రూ. 24.38 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 390 నుండి 473 కిమీల పరిధిని కవర్ చేయగలదు. కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ డిస్‌ప్లే వంటి డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి.