Home /Author
గుజరాత్ లోని మోహ్సానా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు యూట్యూబ్ లో నకిలీ ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేశారు. స్థానికంగా ఓ చిన్నపాటి గ్రౌండ్ ఏర్పాటు చేసి.. అక్కడి కూలీలు, యువకులకు రోజు కూలీ ఇచ్చి క్రికెట్ ఆడించారు. మ్యాచులను షూట్ చేయడానికి ఐదు హెచ్డీ కెమెరాలను కూడా ఉపయోగించారు.
ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో అల్లాడిపోతున్న శ్రీలంకలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే సతీ సమేతంగా దేశం విడిచి పారిపోయాడు. తొలుత వాయు, జల మార్గాల ద్వారా దేశం నుంచి పారిపోయేందుకు యత్నించిన రాజపక్సేకు.. అధికారులు ఏమాత్రం సహకరించలేదు. అడుగడుగున అడ్డుకున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది. ఒడిశా–ఏపీ తీరం మీదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వైపు కదులుతోంది. మొన్నటి వరకు ఇది ఏపీ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర వైపు కదిలింది. ఇది భూమిపైనే కొనసాగుతూ రెండ్రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని రీతిలో వర్షాలు కురిశాయి. కాగా ఇక నుంచి సెంట్రల్ తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురవనున్నాయి. హైదరాబాద్్,జనగామ, యాదాద్రి, మహబూబ్‌బాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రతి పక్షాలతో పాటు కొన్ని మీడియా ఛానల్లు విషం కక్కుతున్నాయని మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ని భ్రష్టు పట్టించాలని ప్రతిపక్షాలు కొన్ని మీడియా ఛానల్‌లతో పాటు చంద్రబాబు దత్తపుత్రుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని ఆరోపించారు.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముర్ము ఏపీ పర్యటనలో భాగంగా, మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించిందన్నారు.
కరణ్ జోహార్ ప్రస్తుతం రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రణవీర్ సింగ్ మరియు అలియా భట్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో, కరణ్ జోహార్ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఇందులో నటించిన ధర్మేంద్ర, షబానా అజ్మీ మరియు జయ బచ్చన్‌లతో సహా ప్రముఖ నటులతో తన అనుభవాలను పంచుకున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ పునరాగమనానికి సిద్ధమవుతున్నాడు. గత వారం తన చిత్రం ‘రంగమార్తాండ’ను ప్రకటించాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వచ్చే నెలలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
లేడీ సూపర్ స్టార్ నయనతారకు తమిళనాడు అంతటా విపరీతమైన అభిమానం ఉంది ఆమె తన ల్యాండ్‌మార్క్ 75వ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా చేయాలని నిర్ణయించుకుంది. నయన్ 75వ చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. లేడీ సూపర్ స్టార్ 75 అని తాత్కాలికంగా పిలవబడే ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ నిర్మిస్తుంది. స్పెషల్ వీడియో టీజర్‌తో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు గత ఏడాదితో పోల్చితే జూలై 7 నాటికి 15 శాతం తగ్గింది. మొత్తంగా, రైతులు 6.3 మిలియన్ హెక్టార్ల (Ha) పొలాల్లో విత్తలేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్ (CMIE) మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేష్ వ్యాస్ జూన్‌లో తగ్గిన సాగు విస్తీర్ణం వ్యవసాయరంగంలో ఉపాధిని దెబ్బతీసిందని చెప్నారు.