Home /Author anantharao b
ఒక లగ్జరీ బ్యాగ్ దక్షిణ కొరియా అధికార పార్టీని షేక్ చేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ప్రథమ మహిళ కిమ్ కియోన్ హీ ఖరీదైన బ్యాగ్‌ను బహుమతిగా పొందారంటూ వైరల్ అయిన దృశ్యాలు ఈ పరిస్థితి కారణమయ్యాయి.
తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక శక్తి బీఆర్ఎస్ అని, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు (కేసీఆర్) అన్నారు.ఈ నెలాఖరు నుంచి వారం రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరఫున బలమైన వాదనలు వినిపించాలని ఎంపీలను కేసీఆర్ కోరారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ ఎంపీల సమావేశం జరిగింది.
హమాస్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్నయుద్ధంలో ఒళ్లు జలదరించే అంశాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి తమ వెంట సుమారు వంద మంది మహిళలను బందీలుగా తీసుకువెళ్లారు. ప్రస్తుతం వారిలో కొంత మంది గర్భం దాల్చారు.
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావేద్ ను వివాహం చేసుకున్నాక వారద్దిరిపై సోషల్ మీడియాలో పాక్ ప్రజలు విరుచుకు పడుతున్నారు. వారిద్దరు తమ జీవిత భాగస్వాముల నుంచి విడాకులు తీసుకోవడాన్ని వారు తప్పు బడుతున్నారు. ఈ నేపధ్యంలో సానియా మీర్జాకు పాకిస్తాన్‌లోని ప్రజల నుండి బలమైన మద్దతు లభించడం విశేషం.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఖాన్ యూనిస్‌లో హమాస్‌పై దాడులను కొనసాగిస్తోంది. ఇక్కడ ఉగ్రవాదులు నాజర్, అల్-అమల్ ఆసుపత్రుల లోపల మరియు చుట్టుపక్కల నుండి పనిచేస్తున్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారిక ప్రతినిధి ఇలోన్ లెవీ చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉన్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఇటీవలి నివేదిక సూచిస్తోందని హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం సర్వే నివేదికను చదివి వినిపించారు. .
రిపబ్లిక్ డే వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు .తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో పొత్తు ధర్మం ప్రకారం అలా ప్రకటించకూడదని కామెంట్ చేశారు . ఆశావహులు టికెట్ల విషయంలో తనను కూడా ఒత్తిడి చేస్తున్నారని అన్నారు పవన్ .
లుగువారి ఆరాధ్య నటుడు, సౌత్ ఇండియా సూపర్ స్టార్... దశాబ్దాలుగా సామాజికసేవలో తరిస్తున్న రియల్ హీరో.. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది . పద్మ విభూషణ్ అవార్డుతో కేంద్రం ఆయనను గౌరవించింది.ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు... అంటే జనవరి 25న పద్మ అవార్డులు ప్రకటిస్తూ ఉంటారు.
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. మెగా స్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.