Home /Author anantharao b
:కేరళలో అలప్పుజ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్‌కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ ర్యాలీలోపాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఇండియా కూటమిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌కు మధ్య జరుగుతున్న పోటీ వట్టి బూటమని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఒక స్టేజీపైకి వచ్చి చేయి చేయి కలుపుతారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల క్రితం రాజస్థాన్‌లోని బాంస్వారాలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. ఇక మోదీ చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే.. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని సంపదతో పాటు తల్లుల, సోదరి మణుల బంగారం లెక్క వేసి దేశంలోకి అక్రమ చొరబాటు దారులకు... ముస్లింలకు సమానంగా పంచుతామని ప్రకటించింది.
కాకినాడలో రౌడీయిజం ఎక్కువైపోయింది, గంజాయికి కేంద్రస్థానంగా మారిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ లోక్ సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఎన్నికలు సమీపించే కొద్ది ఒడిషాలో లుంగీ పాలిటిక్స్ ఊపందుకున్నాయి. రాష్ర్టంలో అసెంబ్లీతో పాటు లోకసభ ఎన్నికలు ఒకే సారి జరుగనున్నాయి. కాగా లుంగీ పాలిటిక్స్‌కు తెరతీసింది మాత్రం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒడిషాలో ప్రజలు లుంగీలు ధరించరు. లుంగీలు ధరిస్తే చులకనగా చూస్తారు.
తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారయింది. ఈనెల 30, వచ్చేనెల మే 3, 4 తేదీల్లో మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు . ఈనెల 30న జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆందోల్ నియోజకవర్గంలో జరిగే బహిరంగసభకి మోదీ హాజరు కానున్నారు. అదే రోజు సాయంత్రం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఐటీ ఎంప్లాయీస్ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. మే 3న వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో సభకి నరేంద్ర మోదీ హాజరవుతారు.
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్స్‌కు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.ఇంటర్ ఫస్టియర్ లో ఉత్తీర్ణత శాతం 60.01 కాగా 12వ తరగతిలో 64.19 గాఉంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా ఒక్కో పోస్టుకు ముగ్గురేసి చొప్పున అధికారుల పేర్లతో కూడిన ప్యానెల్‌ను పంపాలని సూచించింది
బీఆర్ఎస్, కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రెండు లేదా మూడు సీట్లు గెలుచుకోవచ్చని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిపాజిట్ కూడా రాదన్నారు.మెదక్‌లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలవదన్నారు.
ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు.మే 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వీరిద్దిరిని వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా తన ముందు హాజరుపరచాలని రౌస్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా తీహార్ జైలు అధికారులను ఆదేశించారు.
రేవంత్ రెడ్డి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ చదివారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మెదక్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధుల నివేదికను రేవంత్ రెడ్డికి కొరియర్ పంపించానని తెలిపారు. మెదక్ నివేదికే హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి సమాధానం చెబుతోందని చెప్పారు. మతకల్లోలాలు చేయడం బీజేపీ సిద్దాంతం కాదని.. కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుకున్నది, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు, సోకాల్డ్ వాదులని విమర్శించారు.