Last Updated:

AP Government: ఏపీలో విద్యార్దులకు బైజూస్ కంటెంట్ తో 5.18 లక్షల ట్యాబ్ లు

ఏపీ సీఎం జగన్‌ నాడు-నేడు, విద్యాకానుక, బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ ల పంపిణీ, తరగతిగదులు డిజిటలైజేషన్ పై ఉన్నతస్దాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్దులకు అందించే బ్యాగులు నాణ్యంగా, మన్నిక ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

AP Government: ఏపీలో విద్యార్దులకు బైజూస్ కంటెంట్ తో 5.18 లక్షల ట్యాబ్ లు

Andhra Pradesh: ఏపీ సీఎం జగన్‌ నాడు-నేడు, విద్యాకానుక, బైజూస్ కంటెంట్ తో ట్యాబ్ ల పంపిణీ, తరగతిగదులు డిజిటలైజేషన్ పై ఉన్నతస్దాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్దులకు అందించే బ్యాగులు నాణ్యంగా, మన్నిక ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు ట్యాబ్ లు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. వీటికోసం మొత్తం 5,18,740 ట్యాబ్ లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ట్యాబ్ ల్లో బైజూస్ కంటెంట్ ను కూడా పొందుపరిచి విద్యార్థులకు అందిస్తారు.

తరగతి గదులను డిజిటలైజ్ చేయనున్నారు. అందులో భాగంగా ప్రతి క్లాస్ రూంకు స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 72,481 టీవీలు అవసరమని అధికారులు సీఎంకు తెలిపారు. క్లాస్ రూముల డిజిటలైజేషన్ కు రూ.512 కోట్లకు పైగా ఖర్చవుతుందని వివరించారు. ఈ టీవీలను దశలవారీగా తరగతి గదుల్లో ఏర్పాటు చేయనున్నారు.

2023 మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్ తొలిదశ పూర్తయ్యేలా చూడాలని సీఎం జగన్ అధికారులకు నిర్దేశించారు. ప్రతి పాఠశాలకు ఇంటర్నెట్ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని, డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజి క్లినిక్కుల్లోనూ ఇంటర్నెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి: