Last Updated:

Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్

టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని సోమవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.

Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్

Hyderabad: టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని సోమవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు. స్వల్ప జలుబు లక్షణాలు కనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఈ క్రమంలో తనకు కరోనా సోకినట్లు తేలిందని ఆమె వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాదు కొన్ని రోజులపాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అయితే స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్వీట్ చేశారు. కల్వకుంట్ల కవిత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: