Home /Author anantharao b
భారతదేశపు పదకొండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ముంబై-గోవా మార్గంలో ప్రయాణిస్తుంది.మహారాష్ట్రకు చెందిన పార్లమెంటు సభ్యుల బృందానికి రైల్వే రాష్ట్ర మంత్రి రోసాహెబ్ డాన్వ్ ఈ విషయాన్ని తెలిపారు.
నైజీరియా యొక్క నైజర్ డెల్టా ప్రాంతంలోని అక్రమ చమురు శుద్ధి కర్మాగార స్థలం సమీపంలో జరిగిన పేలుడులో కనీసం 12 మంది మరణించారు, అయితే స్థానిక నివాసితులు మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న “గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్”కు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు.
గవర్నర్ తమిళిసై పై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులు ఆమోదించకపోవడంపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు చీఫ్ సెక్రటరీ. రిట్ పిటిషన్లో ప్రతివాదిగా తెలంగాణ గవర్నర్ తమిళి సై పేరును ప్రస్థావించారు.
రెండు రోజుల క్రితం తనకు గుండెపోటు వచ్చిందని బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.ఆమెకు యాంజియోప్లాస్టీ కూడా చేయాల్సి వచ్చింది. అయితే, ఆమె ఇప్పుడు బాగానే ఉంది
రష్యా -ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచంలోని అత్యంత సంపన్నులు గత ఏడాది అంటే 2022లో పది శాతం సంపద కోల్పోయారని తాజా అధ్యయనంలో తేలింది. అయితే ఈ ఏడాది చివరి నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
అమెరికాలోని టేనస్సీ లింకన్ కౌంటీలో ఒక నిర్మాణ ప్రాజెక్ట్‌ను దాని యజమాని విస్కీ తయారు దారు జాక్ డేనియల్స్ ఆపివేయవలసి వచ్చింది. లింకన్ కౌంటీ నివాసి క్రిస్టీ లాంగ్ అనే మహిళ తన ఆస్తి అంతా విస్కీ ఫంగస్ తో కప్పబడి ఉందని ఫిర్యాదు చేయడంతో ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది.
టర్కీలో ఘోరమైన భూకంపాలు సంభవించి దాదాపు నెల గడిచినా, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బుధవారం, హటాయ్లోని అంటక్యా జిల్లాలో 23 రోజుల తర్వాత శిథిలాల కింద నుండి 'అలెక్స్' అనే కుక్క రక్షించబడింది.
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఇద్దరు మహిళా అభ్యర్థులు -సల్హౌతుయోనువో క్రూసే మరియు హెకాని జఖ్లాలు - గురువారం నాడు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇద్దరు అభ్యర్థులు అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)కి చెందినవారు.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌరీపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు