Home /Author anantharao b
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసుకు సంబంధించి అధికారులు ప్రశ్నిస్తున్నారు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టోల్ ట్యాక్స్‌ను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నందున ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులు మరియు ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించడం కొంచెం ఖరీదైనదిగా మారే అవకాశముందని తెలుస్తోంది
తమిళనాడులో వలస కార్మికులపై దాడులకు సంబంధించి అసత్యాలు ప్రచారం చేసారంటూ తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై పై పోలీసులు కేసు నమోదు చేసారు. అతనితో పాటు , ఇద్దరు జర్నలిస్టులతో సహా నలుగురిపై కూడా తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు
:రష్యా సైనికులు చేసిన 171 లైంగిక హింస కేసులపై ఆ దేశ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు జరుపుతోందని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్స్కా తెలిపారు. లైంగిక హింస మరియు యుద్ధ నేరాలపై ప్యానెల్ చర్చను ఉద్దేశించి జెలెన్స్కా మాట్లాడుతూ, పైన పేర్కొన్న గణాంకాలు అధికారికంగా ఉన్నాయని అన్నారు.
ఇంగ్లిష్ ఛానల్ మీదుగా యూరప్ నుండి చిన్న పడవలలో బ్రిటన్‌కు చేరుకునే వలసదారులపై కఠినంగా వ్యవహరించడానికి యునైటెడ్ కింగ్డమ్ కొత్త చట్టాన్ని ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. నివేదికల ప్రకారం చట్టం మంగళవారం ఆవిష్కరించబడుతుంది.
: ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న చైనా ఈ ఏడాది రక్షణ బడ్జెట్‌ను 7.2 శాతంపెంచనున్నట్లు ప్రకటించింది.ఆదివారం ఉదయం విడుదల చేసిన ముసాయిదా బడ్జెట్ నివేదికలో, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం దాదాపు 1.55 ట్రిలియన్ యువాన్లు ($224 బిలియన్లు) ఖర్చు చేయనున్నట్లు అంచనా వేయబడింది.
పాత పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకోవడానికి ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బృందానికి ప్రభుత్వం వన్-టైమ్ ఆప్షన్ ఇచ్చింది. శుక్రవారం సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం, డిసెంబర్ 22, 2003కి ముందు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరిన ఉద్యోగులు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్, 1972 ప్రకారం పాత పెన్షన్ స్కీమ్‌లో చేరడానికి అర్హులు
రష్యా నుండి భారతదేశం యొక్క ముడి చమురు దిగుమతులు ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి. సాంప్రదాయ సరఫరాదారులు ఇరాక్ మరియు సౌదీ అరేబియా నుండి కలిపి దిగుమతుల కంటే ఇది అధికం.
తాజాగా జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో త్రిపురలోని ధన్పూర్ అసెంబ్లీ నియోజక వర్గంనుంచి గెలిచిన కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా అరెస్టు నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు లేఖ రాశాయి.