Home /Author anantharao b
భారత సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్‌ప్రదేశ్ లోని పశ్చిమ కమెంగ్ జిల్లా మండలా పర్వత ప్రాంతంలో ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్, ఒక క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవాలని కోరుతూ తనకు రూ.1 కోటి లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఒక మహిళా డిజైనర్‌పై కేసు దాఖలు చేసింది.
: అస్సాంలోని తేయాకు తోటల కార్మికులకు షెడ్యూల్డ్ తెగల హోదా కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా అస్సాంలోని ఆదివాసీ సంఘం ఇతర వెనుకబడిన తరగతుల (OBC)తో ఒక ప్రత్యేక ఉప వర్గంలో ఉంటుంది
చనిపోయిన తరువాత అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేసే అత్యధిక వ్యక్తులతో కేరళ మొదటి స్థానంలో ఉంది.ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కేరళలో సుమారు 1.30 లక్షల మంది అవయవాలు దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయగా, ఢిల్లీలో దాదాపు 58,000 మంది అవయవదానానికి నమోదు చేసుకున్నారు.
చైనాలో యాంటీవైరల్ ఫ్లూ ఔషధాల ఆన్లైన్ అమ్మకాలు ఏడాది క్రితం కంటే 100 రెట్లు పెరిగాయి. చైనా ఆధారిత ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు టావోబావోలో మార్చి మొదటి 13 రోజుల్లో ఒసెల్టామివిర్ అనే జెనెరిక్ పేరుతో విక్రయించబడుతున్న ఈ ఔషధం అమ్మకాల పరిమాణం దాదాపు 533,100 యూనిట్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది.
:పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) అధినేత్రి మెహబూబా ముఫ్తీ బుధవారం పూంచ్ జిల్లాలోని ఓ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు. ముఫ్తీ ఆలయ సందర్శనను భారతీయ జనతా పార్టీ "రాజకీయ జిమ్మిక్"గా అభివర్ణించింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో బుధవారం నాడు కురిసిన కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పౌరులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఢిల్లీ ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్ యూనిట్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తాజా అవినీతి కేసును నమోదు చేసింది.
:ఫ్రెడ్డీ తుఫాను కారణంగా మొజాంబిక్ మరియు మలావిలో సంభవించిన వరదలకు 300 మంది మరణించగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. తుఫాను కారణంగా దేశంలోని ఆర్థిక కేంద్రమైన బ్లాంటైర్‌తో సహా మలావి యొక్క దక్షిణ ప్రాంతంలో కనీసం 300 మంది మరణించగా మరో 88,000 మంది నిరాశ్రయులయ్యారు.
మద్యపాన నిషేథం అమల్లో ఉన్న బీహార్‌లో ఒక దినసరి కార్మికుడికి ఇవ్వాల్సిన వేతనంగా రెండు మద్యం సీసాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలు కలకలం సృష్టించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.