Home /Author anantharao b
అయోధ్య లో నిర్మాణంలో ఉన్న రామమందిరం యొక్క తాజా చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. ఈ చిత్రాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి ట్విట్టర్లో పంచుకున్నారు. ఆలయ పనులు 2024లో పూర్తికానుండగా, ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.
పీఎంఓ కార్యాలయం సీనియర్ అధికారినంటూ జమ్ము కశ్మీర్ ప్రభుత్వ అధికారులకు టోకరా వేశాడు గుజరాత్‌కు చెందిన ఓ మోసగాడు. తనకు తాను ప్రధాన మంత్రి కార్యాలయంలో సీనియర్ అధికారినంటూ జెడ్ ఫ్లస్ సెక్యురిటీ తో పాటు బుల్లెట్ ఫ్రూప్ మహీంద్రా స్కార్పియోలో తిరుగుతూ.. ఫైవ్ స్టార్ హోటల్లో బసతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని వసలుతు అనుభవించాడు.
పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ స్కామ్‌లో అరెస్టయిన టీఎంసీ యువనేత కుంతల్ ఘోష్ నుండి అందుకున్న డబ్బును నటులు బోనీ సేన్‌గుప్తా మరియు సోమ చక్రవర్తి తిరిగి ఇచ్చారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై ఒక్కో సీసాపై రూ.10 ఆవు సెస్ విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు శుక్రవారం ప్రకటించారు. దీని ద్వారా సంవత్సరానికి రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.
:నగదు కొరతతో ఉన్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్) నుండి బెయిలౌట్ పొందడానికి కష్టపడుతో్ంది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్ ముందుకు తెచ్చిన కొత్త షరతులు పాకిస్తాన్‌కు రుణ ఒప్పందాన్ని పొందడం మరింత కష్టతరం చేసే అవకాశం ఉంది.
వీడియో షేరింగ్ చైనీస్ యాప్ టిక్ టాక్ ని నిషేధించిన దేశాల జాబితాలో న్యూజిలాండ్ చేరింది. మార్చి చివరి నాటికి నెట్‌వర్క్‌కు యాక్సెస్ ఉన్న అన్ని పరికరాల్లో యాప్ నిషేధించబడుతుంది.
ఆస్ట్రేలియాలోని సిడ్నిలో ఇండియన్ కమ్యూనిటికి చెందిన బాలేష్ దంఖర్ పై డజనకు పైగా రేప్ కేసుల విచారణ జరుగుతోంది. ఆయన మహిళలపై అత్యాచారం చేయడమే కాకుండా వాటిని రికార్డు కూడా చేశాడు.
గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తన ప్రసంగంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పరువు నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీపై ప్రివిలేజ్ మోషన్ తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఇజ్రాయెల్‌లోని ఒక జంట తమ కుమార్తె తప్పుగా అమర్చిన పిండం నుండి జన్మించిన తర్వాత ఫెర్టిలిటీ క్లినిక్‌పై రూ.226 కోట్లకు దావా వేస్తున్నారు. వీరు రిషాన్ నగరంలోని అసుతా మెడికల్ సెంటర్‌పై దావా వేయాలని నిర్ణయించుకున్నారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో ఖాళీగా ఉన్న మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతేకాదు వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపును కూడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.