Last Updated:

Manipur Riots: మణిపూర్‌లో మహిళామంత్రి ఇంటికి నిప్పు పెట్టిన అల్లరిమూకలు

:మణిపూర్‌లోని ఏకైక మహిళా మంత్రి ఇంటికి అల్లరిమూకల గుంపు నిప్పు పెట్టింది.. అయితే ఇంటికి నిప్పు పెట్టినప్పుడు మంత్రి ఇంట్లో ఎవరూ లేరు. రాజకీయ నాయకుడి ఇంటికి నిప్పు పెట్టడం లేదా రాజకీయ నాయకుడి ఆస్తులను ధ్వంసం చేయడానికి సంబంధించిన ఘటనల్లో ఇది రెండవది.

Manipur Riots: మణిపూర్‌లో మహిళామంత్రి ఇంటికి నిప్పు పెట్టిన అల్లరిమూకలు

Manipur Riots:మణిపూర్‌లోని ఏకైక మహిళా మంత్రి ఇంటికి అల్లరిమూకల గుంపు నిప్పు పెట్టింది.. అయితే ఇంటికి నిప్పు పెట్టినప్పుడు మంత్రి ఇంట్లో ఎవరూ లేరు. రాజకీయ నాయకుడి ఇంటికి నిప్పు పెట్టడం లేదా రాజకీయ నాయకుడి ఆస్తులను ధ్వంసం చేయడానికి సంబంధించిన ఘటనల్లో ఇది రెండవది. అంతకుముందు, నింగ్‌తౌఖోంగ్‌లోని పిడబ్ల్యుడి మంత్రి గోవిందాస్ కొంతౌజం ఇంటిని ఒక గుంపు ధ్వంసం చేసింది. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు మరియు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది.

రెండు తెగల మధ్య ఘర్షణలు..(Manipur Riots)

ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమేలాక్ గ్రామంలో ఉగ్రవాదులు దాడి చేయడంతో కనీసం తొమ్మిది మంది మరణించగా మందికి పైగా గాయపడ్డారు. సాయుధ ఉగ్రవాదులు గ్రామస్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసులు బుధవారం తెలిపారు.ఈ ఏడాది ఏప్రిల్-మేలో మైటీ మరియు కుకీ గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగినప్పటి నుండి మణిపూర్ రాష్ట్రం హింసాత్మకంగా ఉంది. ఇటీవల, హోంమంత్రి అమిత్ షా మణిపూర్‌లో నాలుగు రోజుల పర్యటించారు.

రాష్ట్రంలో హింసను అంతం చేయడానికి తీసుకోవలసిన చర్యలపై అధికార యం త్రాంగానికి దిశా నిర్దేశం చేసారు. ఆయుధాలను అప్పగించాలని సమూహాలకు విజ్ఞప్తి చేసి, శాంతి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మణిపూర్ లో పలు పౌరసంఘాల సమూహాలతో ఆయన సమావేశమయ్యారు. అయితే, మణిపూర్‌లో పరిస్థితులు సాధారణానికి దూరంగా ఉన్నాయి.