Home /Author anantharao b
నైరుతి చైనాలోని పర్వత ప్రాంతాల్లో వరదల కారణంగా కనీసం 15 మంది మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. స్థానిక ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం, 31 మిలియన్ల విస్తారమైన పర్వత ప్రాంతమైన చాంగ్కింగ్లో మధ్యాహ్నానికి మరో నలుగురు వ్యక్తులు తప్పిపోయినట్లు తెలిసింది.
అమెరికా శ్వేతసౌధం లో కొకైన్ మాదకద్రవ్యాన్ని గుర్తించారు. ఇటీవల ఓ తెల్లటి పదార్ధాన్ని అధికారులు పసికట్టారు. అయితే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడర్ దొరికింది. వైట్‌హౌజ్‌లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దాన్ని సీజ్ చేశారు. ఆ తర్వాత ఆ కాంప్లెక్స్‌లో ఉన్న వారిని మరో ప్రదేశానికి తరలించారు
స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎలుకలు తిన్నాయని పోలీసులు పేర్కొనడంతో 22 కిలోల గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను కోర్టు నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలివి.
నీట్ ఎగ్జామ్ ద్వారా MBBS కోర్సుల్లో ప్రవేశాలకు పలు రాష్ట్రాలు నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి. అయితే ఎక్కువ ర్యాంకు వచ్చి ఏపీ, తెలంగాణలో 'B' కేటగిరీ సీట్లకు ఎక్కువ ఫీజు చెల్లించలేని విద్యార్దులకు ప్రత్యమ్నాయాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెబుతున్నారు ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ .
ప్రస్తుతమున్న వైద్య కళాశాలలకి తోడు తెలంగాణలో కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు రానున్నాయి. ప్రతి జిల్లాకి ఓ మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 9 ఏళ్ళల్లో 29 కొత్త మెడికల్ కళాశాలలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ముంబైలో తన పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అజిత్ పవార్ వర్గం, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీరు (బిజెపి) ఎన్‌సిపిని అవినీతిమయం అన్నారు. మరి ఇప్పుడు ఎన్సీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఉద్ధవ్ ఠాక్రేకు ఏం జరిగిందో అదే రిపీటయిందని శరద్ పవార్ అన్నారు.
శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన శాసనసభ్యులందరూ ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు ఏక్నాథ్ షిండే నాయకత్వం వహించినప్పుడు బీజేపీతో చేతులు కలపాలని కోరుకున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. బీజేపీతో జతకట్టాలనే ఉద్దేశ్యాన్ని ధృవీకరిస్తూ ఎమ్మెల్యేలు ఒక లేఖపై సంతకం చేశారని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన చేసిన నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. దీనిపై రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దీనిపైమాట్లాడుతూ, వ్యక్తి యొక్క చర్య హేయమైనది, ఖండించదగినది మరియు మానవత్వానికి అవమానం అని పేర్కొన్నారు
దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. దీనితో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కిలో రూ. 155 గా ఉంది. నివేదికల ప్రకారం, ఉత్పత్తి చేసే ప్రాంతంలో వర్షం కారణంగా సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల ధర పెరిగింది.
రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ మరియు కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని 12 జిల్లాల్లో, మహారాష్ట్రలోని ముంబైలో కూడా నేటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఢిల్లీలో రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది, వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది,