Home /Author anantharao b
గురుకులాల్లో పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు గురువారం టీఎస్పీఎస్సి కార్యాలయాన్నిముట్టడించారు. టీఎస్పీఎస్సి కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అభ్యర్ధుల ఆందోళనతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు
శరద్ పవార్‌కు వ్యతిరేకంగా అజిత్ పవార్ చేసిన తిరుగుబాటును ప్రస్తావిస్తూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) విద్యార్థి విభాగం ఈ రోజు ఢిల్లీ కార్యాలయం వెలుపల "గద్దర్" (ద్రోహి) పోస్టర్‌ను ఉంచింది. అజిత్ పవార్‌ను "అమరేంద్ర బాహుబలి" శరద్ పవార్‌ను వెన్నుపోటు పొడిచే "కట్టప్ప"గా చూపిస్తూ 'బాహుబలి' చిత్రంలోని ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తూ రాష్ట్రవాడీ విద్యార్థి కాంగ్రెస్ పోస్టర్‌ను ఉంచింది.
: ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (FADA) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్‌లో ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు గత ఏడాది నెలలో 1.7 మిలియన్ యూనిట్లతో పోలిస్తే 10 శాతం పెరిగి 1.86 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, ఈ రంగం నెలవారీ విక్రయాలలో 8 శాతం క్షీణతను చూసింది.
డేటా రక్షణ బిల్లు ముసాయిదాకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ప్రకటించిన ఆరు సంవత్సరాల తర్వాత, ఈ చట్టం ఆమోదించబడితే, భారతదేశం యొక్క ప్రధాన డేటా గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ అవుతుంది.
ఆరోగ్య మౌలిక సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రజల కోసం కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) ఆసుపత్రులను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ప్రస్తుతం పారిస్ పర్యటనలో కుమార్తె అలీసాతో కలిసి సరదాగా గడుపుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఈఫిల్ టవర్ ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
భారతదేశం వెలుపల మొదటి ఐఐటి క్యాంపస్ టాంజానియాలోని జాంజిబార్‌లో వస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం తెలిపింది.తూర్పు ఆఫ్రికా తీరంలో టాంజానియా ద్వీపసమూహం అయిన జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం (MOU) సంతకం చేయబడింది.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఒక వ్యక్తి మూత్ర విసర్జన బాధితుడయిన గిరిజన కూలీ దశమత్ రావత్ ని కలిశారు. తన అధికారిక నివాసంలో అతడి పాదాలను కడిగారు.సిద్ధి జిల్లాలో కార్మికుడిపై మూత్ర విసర్జన చేస్తూ కెమెరాలో చిక్కుకున్న ప్రవేశ్ శుక్లానుబుధవారం అరెస్ట్ చేసి అతడి ఆస్తిని బుల్డోజర్ తో కూల్చేసిన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు తూర్పున ఉన్న బోక్స్‌బర్గ్ సమీపంలో గ్యాస్ లీక్ అవడంతో 16 మంది మరణించారని ప్రావిన్షియల్ ప్రభుత్వ అధిపతి బుధవారం మరణాల పునశ్చరణ తర్వాత తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని గౌటెంగ్ ప్రావిన్స్ ప్రీమియర్ పన్యాజా లెసుఫీ తెలిపారు.
మెక్సికోలోని ఓక్సాకా రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రయాణీకుల బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోవడంతో ఏడాదిన్నర పసిబిడ్డతో సహా కనీసం 29 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరో 20 మంది గాయపడ్డారు.