Last Updated:

KCR : తెలంగాణలో మళ్లీ అధికారం మాదే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR : తెలంగాణలో మళ్లీ అధికారం మాదే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఒంటరిగానే గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయని, అధికారం కోసం కొందరు కండువాలు మార్చడం పరిపాటిగా మారిందని పరోక్షంగా అన్నారు. సిరి సంపదలు ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లపాటు ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా గడిపారని గుర్తుచేశారు.

 

 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. దీంతో మరోసారి రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకుందని తెలిపారు. రాష్ట్రం కోసం ఎప్పటికైనా పోరాటం చేసేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచే వారు కాదని హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదన్నారు. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ అయితే మళ్లీ మనదే అధికారం ధీమా వ్యక్తం చేశారు. రాష్ర్ట హక్కుల కోసం మరోసారి పోరాటం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి: