Home /Author anantharao b
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినీ విమర్శించాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పారు. సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సందర్శించారు
ఉద్యోగాల కోసం భూములు కుంభకోణంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ యాదవ్, రబ్రీ దేవిలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోమవారం చార్జిషీట్ దాఖలు చేసింది.ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
యునైటెడ్ స్టేట్స్‌లోని ఒక కళాశాల ప్రొఫెసర్ మహిళా విద్యార్థినులను వారి షర్టులను తీసివేయమని కోరినందుకు ఉద్యోగం నుండి తొలగించబడ్డారు. ఈ ఘటనలో విద్యాశాఖ పరిధిలోని పౌరహక్కుల కార్యాలయం విచారణ అనంతరం ఈ చర్య తీసుకుంది.
తనకి పదవులు కావాలంటూ ఇంతకాలం పార్టీ అధిష్టానం దగ్గర విన్నపాలు వినిపించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇప్పుడు జోరు పెంచారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రఘునందన్ రావు ఇంకో అడుగు ముందుకేశారు
చైనీస్ బిలియనీర్ అలీబాబా వ్యవస్థాపకుడు మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో రహస్యపర్యటన ప్రస్తుతం పాక్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నేపాల్ నుంచి పలువురు వ్యాపారవేత్తలతో కలసి ప్రత్యేక విమానంలో పాక్‌గడ్డపై దిగారు. మొత్తం 23 గంటల పాటు అక్కడ గడిపారని ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్ వెల్లడించింది.
మహబూబ్ నగర్ మాజీ ఎంపి, బీజేపీ నేత జితేందర్ రెడ్డితో హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ ముగిసింది. జితేందర్ రెడ్డి ఫాం హౌజ్‌లో 20 నిమిషాలపాటు ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయకూడా లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆనందరావు తన ఇంట్లోనే ఫ్యానుకు వురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు , ఈ సంఘటన జిల్లాలో సంచలనం గా మారింది. గత పది నెలల నుంచి తాడిపత్రి పట్టణంలో విధులు నిర్వహిస్తున్న అనంతరావు పూరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు.
హైదరాబాద్‌కి చేరుకున్న సమాజ్‌వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ ప్రగతి భవన్లో సిఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. బేగంపేట విమానాశ్రయంలో అఖిలేష్ యాదవ్‌కి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు.
108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 146 కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఈ అంబులెన్స్‌లను సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభించారు.
ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్ అజిత్ పవార్ మరియు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను తమ పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్సీపీ శ్రేణులు పార్టీ అధినేత శరద్ పవార్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్‌కు ఇ-మెయిల్ కూడా పంపినట్లు పాటిల్ తెలిపారు.