Home /Author anantharao b
పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తేదీని పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటన జారీ చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశంలోని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి
ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళ, బుధవారాల్లో రెండు రౌండ్ల ఇజ్రాయెల్ దాడుల్లో సుమారుగా 195 మంది పాలస్తీనియన్లు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మీడియా కార్యాలయం పేర్కొంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ప్రతిపక్ష ఎంపీలు క్యాష్ ఫర్ క్వరీ అంశంపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సమావేశం నుంచి వాకౌట్ చేసారు. కమిటీ శ్రీమతి మొయిత్రాను వ్యక్తిగత మరియు అనైతిక ప్రశ్నలు అడిగారని ప్రతిపక్ష ఎంపీలు చెప్పారు.
కర్ణాటక చిక్కబళ్లాపూర్ జిల్లాలో ప్రాణాంతక జికా వైరస్‌ను గుర్తించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్య అధికారులు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ప్రారంభ దశలో సంక్షోభాన్ని తగ్గించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు
సాధారణంగా మనీ లాండరింగ్ కేసుల్లో ఈడీ కేసులు నమోదయి వ్యక్తులను విచారణకు పిలవడం అందరికీ తెలిసిందే. అటువంటి ఈడీ అధికారులే లంచం తీసుకున్నారంటే వ్యవస్ద ఎలా ఉందో తెలుస్తుోంది. లంచం తీసుకున్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి చెందిన ఇద్దరు అధికారులను అరెస్టు చేశారు.
ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీతో పాటు చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాదులో రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బడంగ్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కు ఏటీఎంలా మారిందని.. తెలంగాణలో లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లిలో నిర్వహించిన మహిళా సాధికారత సదస్సులో పాల్గొన్నారు.
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ముంబై వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించారు. ఏప్రిల్‌లో టెండూల్కర్ 50వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆ సంవత్సరం ప్రారంభంలో ఆవిష్కరించాలని మొదట అనుకున్నారు. అయితే, నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో ఇప్పుడు జరిగింది.
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఆయన కుటుంబ సభ్యులు, కంపెనీలకు చెందిన రూ.538 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.బ్యాంక్ రుణ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.