Home /Author anantharao b
ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. సత్తుపల్లిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రతిపక్షాలపై కేసీఆర్ విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు బై బై చెప్పాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. కల్వకుర్తి కాంగ్రెస్ విజయభేరి సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేసీఆర్ రాజులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
మణిపూర్ ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 5 వరకు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. హోం శాఖ మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని వారంలోపు రెండుసార్లు పొడిగించడం గమనార్హం.హానికరమైన సందేశాలు, ఫోటోలు మరియు వీడియోలు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అక్టోబర్ నెలలో వస్తు మరియు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ గణనీయమైన రాబడి ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన రెండవ అత్యధికం కావడం విశేషం. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం ఇది సంవత్సరానికి 13% గణనీయమైన వృద్ధిని సాధించింది.
విదేశీ పాస్‌పోర్ట్ హోల్డర్ల మొదటి బృందం బుధవారం యుద్ధంలో దెబ్బతిన్న గాజా స్ట్రిప్ నుండి ఈజిప్ట్‌కు బయలుదేరింది. ఈ తరలింపు ఈజిప్ట్, ఇజ్రాయెల్ మరియు హమాస్‌లతో కూడిన కతార్ మధ్యవర్తిత్వ ఒప్పందం ఫలితంగా వచ్చింది.
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగాన్ని ప్రారంభించారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ఫామ్‌హౌస్‌లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగానికి అంకురార్పణ జరిగింది.
గాజాపై వైమానిక దాడిలో టాప్ హమాస్ కమాండర్ ఇబ్రహీం బియారీ హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడిఎఫ్) బుధవారం ప్రకటించింది.ఐడిఎఫ్ ఫైటర్ జెట్లు హమాస్ సెంట్రల్ జబాలియా బెటాలియన్ కమాండర్ ఇబ్రహీం బియారీని హతమార్చాయి అక్టోబర్ 7న జరిగిన హంతక ఉగ్రవాద డికి కారణమైన నాయకులలో బియారీ ఒకరు అని ఐడిఎఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో పేర్కొంది.
అందరూ ఊహించినట్లుగానే బీజేపీ నేత,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ గూటికి చేరారు. తెలంగాణ బిజెపికి షాకిచ్చారు. వివేక్‌తోపాటు ఆయన కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మంగళవారం కొల్లాపూర్ లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో ఆయన ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ మంగళవారం హూజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.ప్రజలు మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పార్టీల చరిత్ర, వైఖరిపై చర్చ జరగాలని అన్నారు.