Home /Author anantharao b
కేరళలో ఆదివారంనాడు జరిగిన వరుస పేలుళ్ల ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక విద్వేష వ్యాప్తికి, ఇరు వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
తమ ఐఫోన్లను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ అలర్ట్ హెచ్చరికలు అందుకున్నామని భారతదేశంలోని పలువురు ప్రతిపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలపై టెక్ దిగ్గజం యాపిల్ స్పందించింది. శశి థరూర్, మహువా మోయిత్రా, రాఘవ్ చద్దా, ప్రియాంక చతుర్వేది, రాహుల్ గాంధీ మరియు ఇతరులతో సహా ఎంపీలు యాపి పంపిన సందేశాల స్క్రీన్షాట్లను పంచుకున్నారు.
చాలా మంది ప్రతిపక్ష నేతల ఫోన్లు టేప్ అవుతున్నాయని, మొబైల్ దిగ్గజం యాపిల్ పంపిననోటిఫికేషన్ను ఉటంకిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. తమ ఐఫోన్లను స్టేట్-స్పాన్సర్డ్ అటాకర్లు రిమోట్‌గా రాజీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీకి సోమవారం రూ. 400 కోట్లు ఇవ్వాలని లేకపోతే చంపుతామంటూ బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది, గత 4 రోజులుగా పంపిన బెదిరింపుల ఈ మెయిల్స్ లో ఇది మూడవది కావడం విశేషం.
నైజీరియాలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 18 మంది మృతి చెందగా, 70 మందికి పైగా తప్పిపోయారు. స్థానిక అధికారుల ప్రకారం, పడవలో తారాబా రాష్ట్రంలోని ఆర్డో-కోలా జిల్లాలోని చేపల మార్కెట్ నుండి తిరిగి వస్తున్న వ్యాపారులతో సహా 100 మందికి పైగా ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదయింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలతో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు.
హమాస్ ఉగ్రదాడిలో బందీ అయిన జర్మనీ యువతి షానీ లౌక్ మృతదేహాన్ని తాజాగా ఇజ్రాయెల్ గుర్తించింది. గాజాలోకి ప్రవేశించిన తమ దళాలు ఆ మృతదేహాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. షాని కుటుంబం కూడా ఆమె మృతిని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది.
బంగ్లాదేశ్‌లోని వేలాది మంది గార్మెంట్ కార్మికులు సోమవారం కనీస వేతనాలను మూడు రెట్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ నిరసనలు ఫ్యాక్టరీల ధ్వంసానికి దారితీయడంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ను ప్రయోగించి చెదరగొట్టారు,
అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా దేశం విడిచిపెట్టకపోతే, పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వం వారిని దశలవారీగా బహిష్కరించడం ప్రారంభిస్తుందని తాత్కాలిక అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ సోమవారం తెలిపారు. అక్రమ వలసదారుల తొలగింపునకు పాకిస్థాన్ ఈ నెల అక్టోబర్ 31 తేదీని డెడ్ లైన్ గా ప్రకటించింది.
కేరళ ప్రార్దనా మందిరంలో పేలుళ్ల కేసులో నిందితుడు డొమినిక్ మార్టిన్, యూట్యూబ్ ట్యుటోరియల్స్ సహాయంతో పేలుడు పదార్థాలను తయారు చేయడం నేర్చుకున్నానని చెప్పాడు. కొచ్చిలోని తమ్మనంలోని తన అద్దె ఇంటి టెర్రస్‌పై మరియు అలువా సమీపంలోని పూర్వీకుల ఇంటిపై ట్రయల్స్ నిర్వహించినట్లు పోలీసులకు చెప్పాడు.