Last Updated:

AP Govt Nominated Posts: ఏపీలో భారీగా నామినేటెడ్‌ పదవుల భర్తీ.. 10 నామినేటెడ్‌ పోస్టులు దక్కించుకున్న జనసేన

AP Govt Nominated Posts: ఏపీలో భారీగా నామినేటెడ్‌ పదవుల భర్తీ.. 10 నామినేటెడ్‌ పోస్టులు దక్కించుకున్న జనసేన

AP Nominated Posts Second List Released: రాష్ట్రంలో సామాజిక, రాజకీయ న్యాయానికి సమతూకం కుదిరింది. పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ – జనసేన – బీజేపీ వివిధ నామినేటెడ్‌ పదువులను దక్కించుకున్నాయి. ఆయా పార్టీల ముఖ్య నాయకుల సమక్షంలో ఇది వరకే నిర్ణయించిన ధామాషా ప్రకారం కేటాయింపులు జరిగాయి. ఇందులో జనసేన దాదాపు 16శాతం దక్కించుకోవడం విశేషం.

నామినేటెడ్‌ పదవుల  భర్తీ

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. తొలి జాబితాలో ఆర్టీసీ, పౌర సరఫరాలు, ఏపీఐఐసీ, వక్స్‌ బోర్డు వంటి 20 కీలక కార్పొరేషన్లకు చైర్మన్‌ లతో పాటు ఆర్టీసీకి వైస్‌ చైర్మన్‌ లను కూడా నియమించింది. తాజాగా వివిధ సామాజిక వర్గాల సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ లకు చైర్మన్‌ లను నియమిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. దీంతో పాటు పట్టాభిరామ్‌ (స్వచ్చ ఆంధప్రదేశ్‌ మిషన్‌ ), తేజస్వీ (ఏపీ కల్చరల్‌ మిషన్‌(తేజస్వీ), జీవీ రెడ్డి ( ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌), సుజయ్‌ కృష్ణ రంగారావు (అటవీ అభివృద్ధి), జి.కోటేశ్వరరావు (గ్రంథాలయ పరిషత్‌) సహా వివిధ పట్టణాల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథానిటీ లకు చైర్మన్‌ లను కూడా నియమించింది. పొత్తు ధర్మాన్ని పాటించి, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసిన వారికి అందులో గుర్తింపు లభించింది. మొత్తం 59 మందిని నామినేటెడ్‌ పదవుల్లో నియమించగా… ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును రాష్ట్ర నైతిక విలువల సలహాదారుగా నియమించి, కేబినెట్‌ ర్యాంకుతో సముచిత స్థానం కల్పించారు. ఈ సామాజిక కూర్చుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలు, సామాజిక వర్గాలు, పట్టణాల అభివృద్ధికి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా వారంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు.

చైర్మన్లుగా నియమితులైన జనసేన నాయకులు…

  • పాలవలస యశస్వి (తూర్పుకాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌), శ్రీకాకుళం
  •  చిలకలపూడి పాపారావు (ఏపీ అగ్నికుల క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌), రేపల్లె
  • చిల్లపల్లి శ్రీనివాసరావు (ఏపీ మెడిక్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌)
  •  రెడ్డి అప్పలనాయుడు (ఏపీఎస్‌ ఆర్టీసీ విజయవాడ జోన్‌ చైర్మన్‌)
  • టీసీ వరుణ్‌ (అనంతపూర్‌ – హిందూపూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ), అనంతపురం
  • తుమ్మల రామస్వామి (కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ), కాకినాడ
  •  కొరికాన రవికుమార్‌ (శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌), శ్రీకాకుళం
  •  వి.సూర్యనారాయణ రాజు (ఏపీ క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌) భీమవరం
  •  కొత్తపల్లి సుబ్బారాయుడు (ఏపీ స్టేట్‌ కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌), నరసాపురం
  •  డాక్టర్‌ పెదపూడి విజయ్‌ కుమార్‌ (ఏపీ మాల సంక్షేమ, సహకార ఆర్థిక కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఒంగోలు

సామాజిక ప్రగతికి కృషి చేస్తా..
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచనల ఉత్తరాంధ్ర జిల్లాలతో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న తూర్పుకాపుల సామాజిక ప్రగతికి నావంతు కృషి చేస్తానని తూర్పుకాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్వి అన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి, వలస కార్మికులకు ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న రిజర్వేషన్ల అంశాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. నిధుల సద్వినియోగంతో పాటు… తూర్పుకాపు లను కేవలం ఓటు బ్యాంకు మాత్రమే చూస్తున్న రోజుల నుంచి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వారిగా మలచేందుకు ప్రత్యేక కార్యచరణతో పని చేస్తానని వెల్లడించారు.

పదవులు దక్కించుకున్నది వీరే..

  • అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ అఫైర్స్ ) క్యాబినెట్ ర్యాంక్ – మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టీడీపీ)
  • అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) క్యాబినెట్ ర్యాంక్ – చాగంటి కోటేశ్వర్ రావు
  • ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి – టీడీపీ)
  • ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – మాల సురేంద్ర ( అనకాపల్లి -టీడీపీ)
  • ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట – టీడీపీ )
  • ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ ( మాడుగుల – టీడీపీ )
  • ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – దేవేంద్రప్ప ( ఆదోని – టీడీపీ )
  • ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ఆర్ సదాశివ ( తిరుపతి – టీడీపీ )
  • ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ )
  • ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు – టీడీపీ )
  • ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ – సి ఆర్ రాజన్ ( చంద్రగిరి – టీడీపీ)
  • ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – నరసింహ యాదవ్ ( తిరుపతి – టీడీపీ )
  • ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు – టీడీపీ )
  • ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ – గండి బాబ్జి ( పెందుర్తి – టీడీపీ)
  • ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ – మంజులా రెడ్డి రెంటిచింతల – ( మాచర్ల – టీడీపీ)
  • ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు – నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి – టీడీపీ)
  • ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవి రెడ్డి ( మార్కాపురం – టీడీపీ )
  • ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ – మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టీడీపీ )
  • ఏపీ కల్చరల్ కమిషన్ – తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు – టీడీపీ)
  • ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు – టీడీపీ)
  • ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి – టీడీపీ )
  • ఏపీ గ్రంధాలయ పరిషద్ – గోనుగుంట్ల కోటేశ్వర రావు ( నరసరావుపేట – టీడీపీ )
  • ఏపీ ఇండస్ట్రియల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ – టిడిపి )
  • ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ( కేకే చౌదరి – కోడూరు – టీడీపీ )
  • ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి – టీడీపీ )
  • ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ – మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు – టీడీపీ )
  • ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవెలప్మెంట్ అధారిటీ – ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ – టీడీపీ)
  • ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ – రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ – టీడీపీ )
  • ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ – సావల దేవదత్ (తిరువూరు – టీడీపీ )
  • ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ – రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ – టీడీపీ )
  • ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ – కావాలి గ్రీష్మ ( రాజాం – టీడీపీ )
  • ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర – టిడిపి( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు – టీడీపీ కడప జోన్ )
  • ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ – సజ్జా హేమలతా ( చీరాల – టీడీపీ )
  • ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు – టీడీపీ )
  • ఎన్టీఆర్ వైద్య సేవ – సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ – టీడీపీ )
  • స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ – కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ -టీడీపీ)
  • అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం – టీడీపీ )
  • అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – రూపానంద రెడ్డి ( కోడూరు – టీడీపీ )
  • బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల – టీడీపీ )
  • బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి – టీడీపీ)
  • చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కే. హేమలత ( చిత్తూరు – టీడీపీ )
  • కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు – టీడీపీ )
  • నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ – టీడీపీ )
  • రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం – టీడీపీ )
  • విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ – ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ )
  • ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ – ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టీడీపీ )
  • ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ – టీడీపీ)
  • ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ – టీడీపీ )
  • ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ – టీడీపీ )

ఇవి కూడా చదవండి: