Home / క్రికెట్
Canada Vs Argentina: ప్రపంచ క్రికెట్లో మరో సంచలనం నమోదైంది. కేవలం ఐదు బంతుల్లోనే ఓ జట్టు మ్యాచ్‌ను ముగిసింది. అండర్- 19 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో రికార్డు విజయంతో కెనడా చరిత్ర సృష్టించింది. తన కంటే చిన్న జట్టు అర్జెంటీనాను బెంబేలిత్తించి స్వల్ప లక్ష్యాన్ని మొదటి ఓవర్లోనే ఛేదించింది. కెనడా సాధించిన ఈ ఘనత వన్డే క్రికెట్లో అరుదైన, వేగవంతమైన విక్టరీగా చరిత్రలో నిలిచిపోనుంది. అండర్ -19 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా జార్జియాలోని […]
Womens Cricket: మరో 50 రోజుల్లో భారత్ వేదికగా మహిళ వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబైలో ‘ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. భారత లెజెండ్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్, మిథాలీ రాజ్‌తోపాటు ప్రస్తుత మహిళా క్రికెట్ స్టార్స్ హర్మన్ ప్రీత్ కౌర్ , స్మృతి మందాన, జెమీమా రోడ్రిగ్స్, ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా ఈ ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఐసీసీ ఛైర్మన్ జై […]
New Zealand vs Zimbabwe: జింబాబ్వే టూర్లో ఉన్న కివీస్ తమ ప్రదర్శనతో అదరగొడుతోంది. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 359 పరుగుల తేడాతో గెలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది మూడో అతిపెద్ద విజయం. న్యూజిలాండ్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 125 పరుగులకే ఆలౌట్ […]
Womens Cricket: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మహిళల జట్టు తడబడుతోంది. వరుసగా రెండో టీ20లోనూ బ్యాటర్లు సమిష్టిగా విఫలమయ్యారు. దీంతో భారత ఏ జట్టు 73 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ఏ బౌలర్ల ధాటికి నిలువలేక 144 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓపెనర్ షఫాలీ వర్మ, కెప్టెన్ రాధా యాదవ్ నిరాశపరచగా.. వ్రిందా దినేశ్ (21), మిన్ను మణి (20) పోరాడినా భారీ ఓటమిని తప్పించలేకపోయారు. ఓపెనర్ల విధ్వంసానికి కిమ్ గార్త్ సంచలన బౌలింగ్ తోడవడంతో […]
Yash Dayal banned from UPT20 2025?: లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాల్‌కు మరో భారీ షాక్ తగిలింది. యూపీఎల్ టీ20 లీగ్-2025లో పాల్గొనకుండా ఉత్తరప్రదేశ్ క్రికెట్ ఆసోషియేషన్ నిషేదం విధించినట్లు తెలుస్తోంది. ఇటీవల దయాల్‌పై పోక్సో కేసు నమోదైంది. దీంతో యూపీ క్రికెట్ ఆసోయేషిన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం జులైలో దయాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని జైపూర్‌కు చెందిన 17 ఏళ్ల […]
Jersey Auction: టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు (754) చేసిన ఆటగాడిగా నిలిచిన గిల్, ఇప్పుడు మరో అరుదైన రికార్డు సృష్టించారు. ఇటీవల ఒక ఛారిటీ వేలంలో, శుభ్‌మన్ గిల్ టెస్ట్ జెర్సీకి అత్యధిక ధర పలికింది. ఇంగ్లాండ్, భారత్ జట్ల ఆటగాళ్ల జెర్సీలపై వేలం నిర్వహించగా, గిల్ జెర్సీ అత్యంత ఖరీదైనదిగా […]
Australia Openers: వచ్చే ఏడాది 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు ఇండియా, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పొట్టి సమరానికి ఇప్పటికే 20 జట్లలో 15 జట్లు అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీకి అన్ని జట్లు ఇప్పటి నుంచే సన్నాహకాలు ప్రారంభించేశాయి. ఐసీసీ టోర్నీ అంటే అద్భుతంగా ఆడే ఆస్ట్రేలియా మరో ఆరు నెలల్లో జరగబోయే వరల్డ్ కప్ కు వారి ఓపెనర్లను ఖరారు చేసింది. ఎల్లుండి నుంచి సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా […]
Pakistani cricketer Haider Ali: పాకిస్థాన్ క్రికెటర్ హైదర్ అలీపై పాక్ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ విధించింది. అతనిపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. బ్రిటన్‌లో ఓ బాలికను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అతని అరెస్టు చేసి, బెయిల్‌పై విడుదల చేశారు. ఇంగ్లండ్‌లో పాకిస్థాన్ షహీన్స్ జట్టు టూర్ చేస్తున్నది. ఈ ఘటన సమయంలో జరిగినట్లు తెలుస్తోంది. క్రిమినల్ కేసు కోణంలో విచారణ జరుగుతున్నది. గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అతని అరెస్టు చేశారు. 24 […]
Girls In Stadium: సాధారణంగా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కెమెరా మెన్ రకరకాల ఫొటోలను చూపిస్తుంటాడు. కొన్ని ఆసక్తికర ఘటనలు జరిగే వైపు ఎలా చూపిస్తారు. అకస్మాత్తుగా వారికి ఎలా తెలుస్తుందని చాలామందికి డౌట్ వస్తుంది. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు బ్యాట్స్‌మెన్ భారీ సిక్స్ కొట్టగానే కెమెరా ఎక్కువగా అందమైన అమ్మాయిల వైపే మళ్లుంది. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే సిక్స్ కొట్టినప్పుడు మైదానంలోని ప్రేక్షకుల హర్షాతిరేకాలను చూపించడం సర్వసాధారణం. కానీ, కెమెరా […]
Asia Cup 2025: ఆసియా కప్ కోసం సర్వం సిద్ధం అవుతోంది. ఈసారి టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. కాగా సెప్టెంబర్ 9న ప్రారంభమయ్యే టోర్నమెంట్.. సెప్టెంబర్ 28న ముగుస్తుంది. ఈవెంట్ కు ఆతిథ్యం ఇచ్చేది భారత్ అయినా.. గతంలో పాకిస్తాన్ తో ఒప్పందంలో భాగంగా తటస్థ వేదిక యూఏఈలో మ్యాచ్ లు జరగనున్నాయి. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈతో భారత్ మొదటి మ్యాచ్ ఆడనుంది. టోర్నీకి ఇంకా నెల రోజులు సమయం ఉన్నా.. […]