Uttarkashi Tunnel: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ పనులు మరింత ఆలస్యం.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో టన్నెల్ నుంచి 41మంది కూలీలను బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్లో భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది.టన్నెల్ ముందు నుంచి అగర్ మెషిన్ ద్వారా చేస్తున్న డ్రిల్లింగ్ పనులు పూర్తి కాకముందే మెషిన్ బ్లేడ్లు ముక్కలుముక్కలుగా విరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు అన్వేషిస్తున్నారు.
Uttarkashi Tunnel: ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో టన్నెల్ నుంచి 41మంది కూలీలను బయటకు తీసే రెస్క్యూ ఆపరేషన్లో భారత సైన్యం కూడా రంగంలోకి దిగింది.టన్నెల్ ముందు నుంచి అగర్ మెషిన్ ద్వారా చేస్తున్న డ్రిల్లింగ్ పనులు పూర్తి కాకముందే మెషిన్ బ్లేడ్లు ముక్కలుముక్కలుగా విరిగిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను నిపుణులు అన్వేషిస్తున్నారు.
చాలా సమయం పడుతుంది..(Uttarkashi Tunnel)
హైదరాబాద్ నుంచి పంపిస్తున్న ప్లాస్మా కట్టర్ ద్వారా అధికారులు మాన్యువల్‌గా తవ్వాలంటున్నారు. ఈ ప్రక్రియ మెుత్తం నెల రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిని ఉత్తరాఖండ్ సీఎం ధామీ సమీక్షించారు. ఆలస్యమైనా అందర్నీ బయటకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.ఎస్కేప్ పైప్ నుండి ఆగర్ యంత్రాన్ని బయటకు తీయగానే, రెస్క్యూ అధికారులు దాదాపు 10 మీటర్ల వరకు మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభిస్తారు.మీడియా సమావేశంలో, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మాట్లాడుతూ ఆపరేషన్ చాలా సమయం పట్టవచ్చని చెప్పారు.
సిల్క్యారా టన్నెల్ సైట్‌కు భారీ నిలువు డ్రిల్లింగ్ పరికరాలను తీసుకువచ్చారు.అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు డిక్స్, ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు క్రిస్మస్ నాటికి బయటపడతారన్నఆశాభావం వ్యక్తం చేసారు.నవంబర్ 26 నుండి నవంబర్ 28 మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కార్యాలయం అంచనా వేసినందున సిల్క్యారా టన్నెల్ సైట్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ మరో సవాలును ఎదుర్కొంటుంది. ఐఎండి సూచన ప్రకారం, వాతావరణం మేఘావృతమై వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.