Last Updated:

Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 మిషన్‌ పై పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసలు

చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సూచించారు. ఈ మిషన్‌ను మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు మరియు ఇస్రోను ఆయన అభినందించారు.

Chandrayaan-3 Mission: చంద్రయాన్-3 మిషన్‌ పై పాకిస్తాన్  మాజీ మంత్రి ఫవాద్ చౌదరి  ప్రశంసలు

Chandrayaan-3 Mission:  చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సూచించారు. ఈ మిషన్‌ను మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణిస్తూ భారత శాస్త్రవేత్తలు మరియు ఇస్రోను ఆయన అభినందించారు.

నాలుగేళ్లకిందట హేళన చేసి..(Chandrayaan-3 Mission)

X (గతంలో ట్విట్టర్ )లో షేర్ చేసిన పోస్ట్‌లో ఫవాద్ చౌదరి మంగళవారం ఇలా వ్రాశాడు. పాక్ మీడియా రేపు సాయంత్రం 6:15 గంటలకు #చంద్రయాన్ మూన్ ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా చూపించాలి…ప్రత్యేకంగా ప్రజలు, శాస్త్రవేత్తల కోసం మానవ జాతికి చారిత్రాత్మక క్షణం. మరియు స్పేస్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియా…. చాలా అభినందనలు. 2019లో, చంద్రయాన్-2 మిషన్ విఫలమైనప్పుడు, అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చౌదరి భారత్ ను హేళన చేసారు.ఎండియా” కేవలం బాలీవుడ్ ద్వారా చంద్రుడిని చేరుకోగలదని వ్యాఖ్యానించారు.

మరోవైపు సోషల్ మీడియాలో ఫవాద్ చౌదరిని నెటిజన్లు ఆడుకున్నారు. పాకిస్థాన్ మాజీ మంత్రిని వెక్కిరించే అవకాశాన్ని నెటిజన్లు ఉపయోగించుకున్నారు. ఫవాద్ దృష్టికోణంలో కొందరు ఈ మార్పును సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ గా సరదాగా పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రజలు బుద్ది తెచ్చుకోవడం విశేషం’ అని సోషల్ మీడియా యూజర్ ఒకరు చమత్కరించారు. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు, ఫవాద్ ఇప్పుడు మారిపోయాడు; అతను భారతదేశంతో చెలగాటమాడకూడదనే భావనను పొందాడు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయబడింది. వర్డ్ ఎండియా, ఇండియాతో భర్తీ చేయబడిందని మరొక నెటిజన్ అన్నారు. భారత్‌కు చెందిన ఇస్రో నుంచి పాక్ నేర్చుకోవాలని పాక్‌కు చెందిన ఓ యూజర్ అన్నారు.