Japan: జపాన్‌లోని హోన్షు ద్వీపాన్ని తాకిన తుఫాన్.. రెండు లక్షలమంది ప్రజల తరలింపు
మంగళవారం జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షు లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమయింది. సెంట్రల్ మరియు వెస్ట్రన్ రీజియన్లలో "ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయిందని జపాన్ వాతావరణ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో తెలిపింది.
Japan: మంగళవారం జపాన్‌లోని ప్రధాన ద్వీపం హోన్షు లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమయింది. సెంట్రల్ మరియు వెస్ట్రన్ రీజియన్లలో “ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయిందని జపాన్ వాతావరణ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో తెలిపింది.
నిలిచిపోయిన విమానాలు.. బుల్లెట్ రైళ్లు.. (Japan)
15,600 గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. క్యోటోలో పాదచారుల వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయింది.240 జపాన్ ఎయిర్‌లైన్ సర్వీసులు, ఎఎన్ఎ కు చెందిన 313, ప్రత్యేకించి ఒసాకాకు సేవలు అందిస్తున్న వాటితో సహా వందలాది విమానాలతో పాటు ఎక్స్‌ప్రెస్ బుల్లెట్ రైళ్లు నిలిపివేయబడ్డాయి.ఒసాకా బేలోని కృత్రిమ ద్వీపంలో ఉన్న కన్సాయ్ విమానాశ్రయంలో దాదాపు 650 మంది ప్రయాణీకులు రాత్రి ఉండిపోవలసి వచ్చింది. స్థానిక ప్రభుత్వాలు 237,000 కంటే ఎక్కువ మంది నివాసితులకు నిర్బంధ తరలింపు సూచనలను జారీ చేశాయి.