Srikantachari’s mother Shankaramma: శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి బిఆర్ఎస్ అధిష్టానం పిలుపు
తెలంగాణ ఉద్యమాన్ని తన ఆత్మబలిదానంతో కీలక మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని ఎట్టకేలకు బిఆర్ఎస్ అధిష్టానం కరుణించినట్లే కనిపిస్తోంది. ఇంతకాలం శంకరమ్మని పట్టించుకోకుండా పక్కనబెట్టిన బిఆర్ఎస్ అధిష్టానం తాజాగా ఆమెని రేపు హైదరాబాద్కి రావాలని పిలిచింది.
Srikantachari’s mother Shankaramma: తెలంగాణ ఉద్యమాన్ని తన ఆత్మబలిదానంతో కీలక మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మని ఎట్టకేలకు బిఆర్ఎస్ అధిష్టానం కరుణించినట్లే కనిపిస్తోంది. ఇంతకాలం శంకరమ్మని పట్టించుకోకుండా పక్కనబెట్టిన బిఆర్ఎస్ అధిష్టానం తాజాగా ఆమెని రేపు హైదరాబాద్కి రావాలని పిలిచింది. అమరవీరుల కుటుంబాలని బిఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. కొంతమందికే ఆర్థిక సాయం అందించారని మిగిలిన వారిని పట్టించుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
విమర్శలకు చెక్ పెట్టాలని..(Srikantachari’s mother Shankaramma)
రేపు అమరవీరుల స్మారక స్థూపం ఆవిష్కరణకి శంకరమ్మని ఆహ్వానించడం ద్వారా విమర్శలకి చెక్ పెట్టాలన్నది బిఆర్ఎస్ అధిష్టానం ఎత్తుగడగా కనిపిస్తోంది. రేపటి కార్యక్రమంలో శంకరమ్మకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా అమరుల కుటుంబాల్ని పట్టించుకోలేన్న ముద్రను చెరిపేసే ప్రయత్నాన్ని బిఆర్ఎస్ ప్రారంభింది. శంకరమ్మకి పదవి ఇస్తామని ఇప్పటికే కేసిఆర్, కెటిఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శంకరమ్మని రేపటి కార్యక్రమానికి ఆహ్వానించడం ప్రాధాన్యతని సంతరించుకుంది.
మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటచారి, శంకరమ్మ దంపతుల పెద్ద కుమారుడు శ్రీకాంతచారి. ఇతడికి రవీంద్రాచారి అనే తమ్ముడు ఉన్నాడు. వీరిది సాధారణ కుటుంబం.స్థానికంగానే ప్రాథమిక విద్యను పూర్తిచేసిన శ్రీకాంత్ ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 2009 నవంబరు 29న హైదరాబాద్లోని ఎల్బీనగర్ చౌరస్తాలో కేసీఆర్ అరెస్టుకు నిరసనగా జరిగిన ధర్నాలో ఒంటిమీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కాలిన గాయాలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3, 2009 న రాత్రి 10.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచాడు.