దోసకాయలు 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో మూడు రోజులకు మించి ఉంచితే త్వరగా కుళ్లిపోతాయి. అందుకే దోసకాయను ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోండి.
బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచడం మానుకోండి. ముడి బంగాళాదుంపలను బహిరంగ బుట్టలో ఉంచడం ఉత్తమం
టొమాటోలను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. టొమాటోలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి రుచి, ఆకృతి మరియు వాసన దెబ్బతింటుంది.
ఉల్లిపాయలను చల్లని, పొడి మరియు బాగా వెంటిలేషన్ ప్రదేశంలో నిల్వ చేయాలి. ఎందుకంటే ఉల్లిపాయ తేమను సులభంగా గ్రహిస్తుంది. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే, అవి కుళ్ళిపోవచ్చు.
అలాగే యాపిల్స్ ను కూడా ఎక్కువ టెంపరేచర్స్ ఉండే శీతల ప్రాంతంలో పెట్టకూడదు. అవి త్వరగా ఆక్సిడైజ్ అవుతాయి