Last Updated:

Andhra Woman Swims: పరీక్ష కోసం ప్రాణాలకు తెగించి నదిని దాటిన యువతి

పరీక్ష కోసం ఓ యువతి ప్రాణాలకు తెగించి చేసిన సాహనంపై నెటిజన్లు శభాష్ అంటున్నారు. పరీక్షకు హాజరయ్యేందుకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటింది. యువతి సంకల్పానికి ఆమె సోదరులు తోడవడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాడి ఆమె పరీక్షకు బయలుదేరింది.

Andhra Woman Swims: పరీక్ష కోసం ప్రాణాలకు తెగించి నదిని దాటిన యువతి

Vizianagaram: పరీక్ష కోసం ఓ యువతి ప్రాణాలకు తెగించి చేసిన సాహనంపై నెటిజన్లు శభాష్ అంటున్నారు. పరీక్షకు హాజరయ్యేందుకు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటింది. యువతి సంకల్పానికి ఆమె సోదరులు తోడవడంతో ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని దాడి ఆమె పరీక్షకు బయలుదేరింది.

గజపతినగరం మండలం మర్రి వలస గ్రామానికి చెందిన తాడ్డి కళావతి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. శనివారం జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు శుక్రవారమే ఇంటి నుంచి ప్ర‌యాణం ప్రారంభించాల‌నుకున్నారు. భారీ వర్షాలు వ‌ల్ల చంపావతి నదిలో నీరు భారీగా ప్ర‌వ‌హిస్తోంది. దీంతో మ‌ర్రి వ‌ల‌స గ్రామానికి ప్ర‌పంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీనితో తన ఇద్దరు సోదరుల సహాయంతో శనివారం జరగాల్సిన పరీక్షకు హాజరయ్యేందుకు యువతి చంపావతి నదిని దాటింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో కళావతి సోదరులు ఆమెను తమ భుజాలపై ఎత్తుకుని నదికి మరొక వైపునకు చేర్చారు. వరద ఉద్ధృతికి వారు ఒడ్డుకు చేరుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమె పరీక్ష రాయాలంటే నదిని దాటించడమే ఏకైక మార్గమని ఆమె సోదరులు ఈ సాహసం చేశారని అంటున్నారు. ఈ సాహసంపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: