Karimnagar: దివ్యాంగురాలితో యువతి సహజీవనం.. చివరికి ఏం జరిగిందంటే?
Karimnagar: కరీంనగర్ జిల్లాలో దివ్యాంగురాలిని ఓ యువతి దారుణంగా మోసం చేసింది. శారీరక సంబంధం పెట్టుకొని ఏకంగా రూ. 35 లక్షల వరకు డబ్బులు గుంజి మోసానికి పాల్పడింది. మోసాన్ని గుర్తించిన దివ్యాంగురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
Karimnagar: కరీంనగర్ జిల్లాలో దివ్యాంగురాలిని ఓ యువతి దారుణంగా మోసం చేసింది. శారీరక సంబంధం పెట్టుకొని ఏకంగా రూ. 35 లక్షల వరకు డబ్బులు గుంజి మోసానికి పాల్పడింది. మోసాన్ని గుర్తించిన దివ్యాంగురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
యువతి మోసం..
కరీంనగర్ జిల్లాలో దివ్యాంగురాలిని ఓ యువతి దారుణంగా మోసం చేసింది. శారీరక సంబంధం పెట్టుకొని ఏకంగా రూ. 35 లక్షల వరకు డబ్బులు గుంజి మోసానికి పాల్పడింది. మోసాన్ని గుర్తించిన దివ్యాంగురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామానికి చెందిన ఓ వికలాంగ యువతి కిరాణం షాపు నిర్వహిస్తోంది. తల్లిదండ్రులు చిన్నపుడే మృతి చెందడంతో.. వారి నుంచి వచ్చిన డబ్బుతో కొన్ని డబ్బులు పోగేసుకుంది.
వికలాంగ యువతి వద్ద ఎక్కువ నగదు ఉన్నట్లు గుర్తించిన అదే గ్రామానికి చెందిన మరో యువతి.. స్నేహం పెంచుకుంది. స్నేహం ముసుగులో.. వికలాంగ యువతితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో నర్మద మాయమాటలు చెప్పి రూ.11.70 లక్షలు ఫోన్‌పే ద్వారా.. మరో రూ.23.30 లక్షలు నగదు తీసుకుంది.
భారీ మెుత్తంలో నగదు తీసుకున్న తర్వాత.. నర్మద అనే యువతి కానిస్టేబుల్ ను వివాహం చేసుకుంది. ఈ విషయంపై వికలాంగ యువతి నర్మదను ప్రశ్నించింది. నా భర్త లేని సమయంలో నీతో ఉంటానని.. నమ్మించింది. పైగా పెళ్లిలో తులం బంగారం బహుమతిగా తీసుకుంది.
ఇక పెళ్లైన కొద్ది రోజులకు వికలాంగ యువతికి దూరంగా ఉండటంతో తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచింది. దీంతో నర్మద అనే యువతి.. గూండాలతో వికలాంగ యువతిపై దాడిచేయించింది. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. ఈ మేరకు జగిత్యాల జిల్లా దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని అధికారులని కోరింది.