Last Updated:

Jio 5G: ఏపీలోని మరో 9 నగరాలకు జియో 5జీ సేవలు

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరికొన్ని నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది.

Jio 5G: ఏపీలోని మరో 9 నగరాలకు జియో 5జీ సేవలు

Jio 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా జియో మరికొన్ని నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను ప్రారంభించింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన 5జీ పట్టణాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 9 పట్టణాలు ఉన్నాయి. మార్చి 21 నుంచి రమో 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 41 నగరాలు, పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్టు జియె ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో జియో 5జీ సేవలు దేశ వ్యాప్తంగా 406 నగరాల్లో అందుబాటులోకి వచ్చాయని కంపెనీ పేర్కొంది.

ఏపీలోని ఆ నగరాల్లో..(Jio 5G)

కాగా, తాజాగా ఏపీలోని ఆదోని, బద్వేల్‌, చిలకలూరిపేట, గుడివాడ, కదిరి, నరసాపురం, రాయచోటి, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం పట్టణాల్లో జియో 5జీ సేవలు ప్రారంభించినట్లు జియో సంస్థ తెలిపింది. గతంలో విజయవాడ, విశాఖ, తిరుమల, తిరుపతి, రాజమహేంద్రవరం, చిత్తూరు, కడప, నరసారావుపేట, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కాకినాడ, కర్నూలు, గుంటూరు తదితర నగరాలు/ పట్టణాల్లో ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

5జీ సేవలు ఉన్న ప్రతి ప్రాంతంలోని వినియోగదారులు ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందుతారని సంస్థ వెల్లడించింది. జియో ట్రూ 5 జీ సేవలు పొందాలంటే కస్టమర్లు 5 జీ మొబైల్ , సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదు. ఆటో మేటిక్ గా సర్వీస్ అప్ గ్రేడ్ అవుతుంది