Last Updated:

Ratan Tata : 85వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రతన్ టాటా… పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ అదేనా?

Ratan Tata : 85వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రతన్ టాటా… పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ అదేనా?

Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి అందరికీ తెలిసిందే. వ్యాపారాల కంటే కూడా దాన గుణంతోనే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. కోట్లలో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా సామాన్య జీవితం గడుపుతుంటారు రతన్ టాటా. కాగా నేడు 85వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 1937 డిసెంబర్ 28న నావల్ టాటా, సూనీ టాటాలకు ముంబయిలో జన్మించారు రతన్ టాటా. 1959లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ డిగ్రీ పొందారు.

1991లో టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టిన ఆయన అన్ని రంగాల్లో టాటా గ్రూప్ ను విస్తరిస్తున్నారు. ఈ 157 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న టాటా గ్రూప్ కింద 17 కంపెనీలు ఇండియన్ స్టాక్ మారెట్లో విస్తరించి ఉండటం విశేషం. జంషెడ్ టాటా స్థాపించిన ఈ టాటా గ్రూప్ కింద మొత్తంగా 9,35,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. భారత జీడీపీలో టాటా గ్రూప్ వాటా సుమారు 2 శాతంగా ఉంటుంది. టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ చూస్తే 240 బిలియన్ డాలర్ల పైనే. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలో టాటా గ్రూప్ ఆదాయం 128 బిలియన్ డాలర్లు కావడం విశేషం.

అయితే రతన్ టాటా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఏంటా అని అందరూ పలు సందర్భాల్లో ఆయనను ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అందుకు గల కారణాన్ని ఆయన వెల్లడించారు. కాగా రతన్ టాటా కూడా గతంలో ప్రేమలో పడ్డారట. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేకపోయానని టాటా తెలిపారు. లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించారట. కానీ అదే సమయంలో టాటా గ్రాండ్‌ మదర్ ఆరోగ్యం క్షీణించడంతో ఇండియాకు రావాల్సి వచ్చిందట. ఆమె కూడా టాటాతో ఇండియాకు వచ్చేందుకు సిద్ధమైంది.

కానీ అదే సమయంలో 1962 లో ఇండో- చైనా యుద్ధం జరుగుతుండడంతో ఇండియాకు వచ్చేందుకు ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని… దీంతో ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్నానని చెప్పారు. టాటాకు సుమారు రూ.3500 కోట్లు ఉన్నట్లు అంచనా. వేస్తుండగా… అందులో అధిక భాగం రాళాలకే వెచ్చిస్తున్న నేపథ్యంలో రతన్ టాటా ప్రపంచ కుబేరుల జాబితాలో పెద్దగా కనిపించరు. కానీ ప్రజలకు మేలు చేస్తున్నందుకు ఆయనకు మరొక్కసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

ఇవి కూడా చదవండి: