Last Updated:

Air Asia India: ఎయిర్ ఏషియా కు 20 లక్షల ఫైన్.. నెలలో ఇది మూడో సారి

ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఎయిర్ ఏసియా’ కు భారత విమానాయాన నియంత్రణ సంస్థ భారీగా జరిమానా విధించింది. పైలెట్ల శిక్షణ విషయంలో నిబంధనలు పాటించలేదని ఎయిర్ ఏసియా కు రూ. 20 లక్షల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Air Asia India: ఎయిర్ ఏషియా కు 20 లక్షల ఫైన్.. నెలలో ఇది మూడో సారి

Air Asia India: ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఎయిర్ ఏసియా’ కు భారత విమానాయాన నియంత్రణ సంస్థ భారీగా జరిమానా విధించింది. పైలెట్ల శిక్షణ విషయంలో నిబంధనలు పాటించలేదని ఎయిర్ ఏసియా కు రూ. 20 లక్షల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

అంతర్జాతీయ పౌర విమానాయాన సంస్థ నిబంధన ప్రకారం పైలెట్ కు సామర్థ పరీక్షలు నిర్వహించేటప్పుడు కచ్చితమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

షోకాజ్ నోటీసులు జారీ(Air Asia India)

కానీ సదరు సంస్థ ఆ నిబంధనలను ఉల్లంఘించింది. దీంతో డీజీసీఏ చర్యలు తీసుకుంది.

అంతేకాకుండా సంస్థ పైలట్ల శిక్షణ విభాగం హెడ్ ను కూడా మూడు నెలల పాటు విధుల నుంచి తొలగించింది. 8 మంది ఎగ్జామినర్స్ ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ఫైన్ వేసింది.

ఈ మేరకు డీజీసీఏ ఎయిర్ ఏషియా మేనేజర్ కు , శిక్షణ విభాగం అధిపతికి , పర్యవేక్షకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించక పోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

నెల రోజుల్లో మూడు జరిమానాలు

పైలట్ ప్రావీణ్య తనిఖీలు, ఇన్ స్ట్రుమెంట్ రేటింగ్ పరీక్షల విషయంలో ఎయిర్ ఏషియా కొన్ని ఖచ్చితమైన కసరత్తులు నిర్వహించలేదని డీజీసీఏ బృందం గుర్తించింది. అది ఉల్లంఘనల కిందకు రావడంతో జరిమానా వేసింది.

కాగా, గత నెల రోజుల్లో టాటా గ్రూప్ ఎయిర్ లైన్స్ కు మూడు సార్లు జరిమానా పడింది. న్యూయార్క్-ఢిల్లీ విమానంలో మూత్ర విసర్జన ఘటనలో ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది డీజీసీఏ.

తర్వాత పారిస్-ఢల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనతో మళ్లీ రూ. 10 లక్షల జరిమానా పడింది. ప్రయాణీకుల విపరీత ప్రవర్తన నేపధ్యంలో ఎయిర్ ఇండియా తన విమానంలో ఆల్కహాల్ సర్వీస్ విధానాన్ని సవరించింది.

అవసరమైతే క్యాబిన్ సిబ్బందికి మద్యం సేవించడాన్ని  తిరస్కరించాలని సూచించబడింది. రెండు అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణీకుల అనుచిత ప్రవర్తనకు గాను డీజీసీఏ జరిమానాలు విధించింది.