USA: మిసెస్ ఆసియా యూఎస్ఏ విజేతగా విశాఖ మహిళ
భారతీయులు దేశవిదేశాల్లో తమదైన గుర్తింపును సొంతచేసుకుంటూ దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నారు. అయితే తాజాగా విశాఖ వాసి అమెరికాలో ఓ అరుదైన ఘనత సాధించింది. మిసెస్ ఆసియా యూఎస్ఏ 2023 పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
USA: భారతీయులు దేశవిదేశాల్లో తమదైన గుర్తింపును సొంతచేసుకుంటూ దేశ ఖ్యాతిని ఖండాంతరాలు దాటిస్తున్నారు. అయితే తాజాగా విశాఖ వాసి అమెరికాలో ఓ అరుదైన ఘనత సాధించింది. మిసెస్ ఆసియా యూఎస్ఏ 2023 పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 19న జరిగిన మిసెస్ ఆసియా యూఎస్ఏ 2023 పోటీల్లో విశాఖపట్టణానికి చెందిన అల్లూరి సరోజ విజేతగా నిలిచారు. ఫలితంగా ఈ కిరీటాన్ని కైవసం చేసుకున్న దక్షిణాదికి చెందిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డుకెక్కింది. అలాగే, ‘మిసెస్ ఆసియా’ టైటిల్‌తోపాటు ‘మిసెస్ పాప్యులారిటీ’, ‘పీపుల్స్ చాయిస్’ అవార్డులను కూడా ఆమె అందుకున్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేస్తున్న సరోజకు భర్త, ఏడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. ఆమె కుటుంబంతో లాస్ఏంజెలెస్లో నివసిస్తున్నారు. ఫ్యాషన్ డిజైనర్ అయిన సరోజ మంచి డ్యాన్సర్ కూడా. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా సఖినేటిపల్లికి చెందిన సరోజ తల్లిదండ్రులు రాంబాబు, పార్వతి ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. ఈ టైటిల్ సరోజ గెలుచుకోవడం పట్ల ఆమె సొంత ఊరిలో సంబురాలు అంబరాన్నంటాయి.
ఇదీ చదవండి: ఆఫ్ఘాన్‌లో ఆకలి కేకలు.. అన్నం బదులుగా నిద్రమాత్రలు