AP TET Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల
ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు.
Amaravati: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు. టెట్‌ను ఆన్లైన్లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేశారు. మొత్తం 150 మార్కులకు జనరల్ అభ్యర్థులు 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది.
ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించారు అధికారులు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 5,25,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం మొత్తం 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఏపీ విద్యాశాఖ. ఈ ఏడాది టెట్‌కు 4,07,329 మంది హాజరయ్యారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను ప్రభుత్వ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. టెట్ ఫలితాలను సెప్టెంబర్ 14న విడుదల చేయవలసి ఉంది. కానీ కొన్నికారణాల వలన ఆలస్యమయింది.