Lavanya Tripathi Photos: బంగారంలా మెరిసిపోతున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి – లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Lavanya Tripathi Latest Photos: లావణ్య త్రిపాఠి.. ప్రస్తుతం మెగా కోడలు బ్రాండ్‌ని ఆస్వాదిస్తోంది. మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్‌తో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కింది.

ఆరేళ్లు డేటింగ్ అనంతరం వరుణ్ తేజ్, లావణ్యలు 2023 నవంబర్‌లో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత లావణ్య వెండితెరపై కనిపించలేదు. ఆ తర్వాత ఏ సినిమాకి కూడా సైన్ చేయలేదు.

దీంతో ఇక మెగా కోడలు అయ్యాక లావణ్య సినిమాలకు గుడ్‌బై చేప్పేసిందా అని అనుకుంటున్న క్రమంలో సతీలీలావతి ప్రాజెక్టుకి సైన్ చేసింది ప్రకటించింది. దీంతో ఆమె రీఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులంతా ఖుష్ అయ్యారు.

అయితే వెండితెరపై ఆమె సందడి కరువైన.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తోంది. అంతేకాదు ఫోటో షూట్స్‌లోనూ పాల్గొంటుంది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అభిమానులకు అలరిస్తోంది.

తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. గోల్డ్ కలర్ ఫ్యాన్సీ డ్రెస్‌లో మెరిసింది ఈ మెగా కోడలు. ఇందులో క్యూట్ క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటుంది. బంగారం మెరిసిపోతుందంటూ నెటిజన్స్ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా అందాల రాక్షసి చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత భలే భటే మొగాడివోయ్ అంటూ నాని సరసన నటించింది.

ఆ వెంటనే అంతరిక్షం, మిస్టర్ చిత్రాల్లో జంటగా నటించారు. అదే టైంలో ప్రేమలో పడ్డ వీళ్లు ఐదేళ్లు సీక్రెట్‌గా రిలేషన్లో ఉన్నారు. ఆ తర్వాత పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.