Last Updated:

Kiran Abbavaram: ఆ సినిమా మధ్యలోనే నా భార్య వెళ్లిపోయింది.. చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యింది

Kiran Abbavaram: ఆ సినిమా మధ్యలోనే నా భార్య వెళ్లిపోయింది.. చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యింది

Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్.. ఆ సినిమా కనుక సక్సెస్ కాకపోతే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానని బహిరంగంగా ఛాలెంజ్ చేశాడు.  ఒక కుర్ర హీరో ఈ రేంజ్ గా చెప్పడంతో ఆ కథలో ఎంత బలం ఉందో చూడడానికి ప్రేక్షకులు థియేటర్ బాట పట్టారు. క సినిమాలో ఆ సత్తా చూసి.. సినిమాను సక్సెస్ చేశారు.

 

క తరువాత కిరణ్.. ఆచితూచి అడుగులు వేస్తాడు అనుకుంటే అంతకుముందులానే వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం కిరణ్ చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయని టాక్. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రుబా రిలీజ్ కు రెడీ అవుతుంది. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కిరణ్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తోంది.

 

ఇప్పటికే దిల్ రుబా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు సారీ, థాంక్స్ అని రోజుకు ఎన్నోసార్లు చెప్పుకొస్తున్నారు. అయితే అసలు వాటి నిజమైన అర్దాలు ఏంటి.. ? ఎప్పుడు వాటిని ఉపయోగిస్తారు.. ? అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన కిరణ్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై మారినంత హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం.. తన భార్య రహస్య గురించి చెప్పుకొచ్చాడు. రాజావారురాణిగారు సినిమాతో కిరణ్, రహస్య పరిచయమయ్యారు. మొదటి సినిమాతో హిట్ అందుకున్న ఈ జంట.. ఆ సినిమా సెట్ లోనే ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో రెండేళ్ల క్రితం ఈ జంట పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రహస్య ప్రెగ్నెంట్. ఆమెతో కలిసి తాను అన్ని సినిమాలు చూస్తాను అని కిరణ్ చెప్పుకొచ్చాడు.

 

అయితే గతేడాది రిలీజ్ అయిన ఒక సినిమాకు భార్యతో పాటు వెళితే.. ఆమె అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యినట్లు కిరణ్ చెప్పుకొచ్చాడు. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమా గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హనీఫ్ అడేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మార్కోని క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో వైలెన్స్ తప్ప ఇంకేమి లేదు. నరుక్కోవడం.. చంపుకోవడం .. రక్తపాతం ఇదే చూపించారు.  చాలామంది ఈ సినిమాను బ్యాన్ చేయాలనీ డిమాండ్ కూడా చేశారు.

 

“మార్కో సినిమాకు నా భార్య రహస్యతో కలిసి వెళ్లాను. ఆ రక్తపాతం చూసి ఆమె చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యింది. మధ్యలోనే ఆ సినిమా నుంచి వెళ్లిపోయింది. ” అని చెప్పుకోచ్చాడు. నిజం చెప్పాలంటే.. మార్కో సినిమాలో అంత రక్తపాతం చూసి చాలామంది అలానే అన్నారు. అందులోనూ రహస్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమె ఆ సన్నివేశాలను చూడలేకపోయిండోచ్చు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.  అయితే కొంతమంది మాత్రం సినిమా అంత వైలెంట్ గా ఉంటుంది అనితెలిసినప్పుడు  ఎందుకు భార్యతో వెళ్ళావ్ బ్రో అంటూ కామెంట్స్ పెడుతున్నారు.