Last Updated:

Rukshar Dhillon: అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు.. చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు

Rukshar Dhillon: అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు.. చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు

Rukshar Dhillon: సోషల్ మీడియా.. ఎప్పుడు ఎవరికీ మంచి చేస్తుందో తెలియదు కానీ, ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లకు మాత్రం ఎప్పుడు చెడునే చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మార్ఫింగ్, ఏఐ జనరేట్ ఫొటోలతో హీరోయిన్లను చాలామంది టార్చర్ పెడుతున్నారు. వారు గ్లామర్ గా డ్రెస్ వేసుకొని కనిపించినా తప్పు ఉద్దేశ్యంతో వాటిని ఉపయోగిస్తున్నారు. ఈ గ్లామర్ ఫీల్డ్ లో  నిత్యం గ్లామర్ గా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు సినిమా కథల కోసం కొద్దిగా ఎక్కువే చూపించాల్సి వస్తుంది. అలా చేసిన ప్రతిసారి వారిపై ట్రోల్స్.. ఆ ఫోటోలను వేరేవిధంగా ఉపయోగిస్తూ వారి పరువులు తీస్తున్నారు.

 

ఇక హీరోయిన్లు బయట కనిపిస్తే చాలు.. ఫొటోల కోసం ఎగబడి పోతారు. తమ అభిమాన హీరోయిన్ కనపడింది.. ఆమెతో ఫోటో దిగాలనుకొనేవారు కొందరు అయితే, కొద్దిగా ఛాన్స్ దొరికింది కదా అని  వారి ప్రైవేట్ పార్ట్స్ ను జూమ్ చేసి ఫోటోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో వేరే విధంగా పోస్ట్ చేసి శునకానందం పొందేవారు ఇంకొంతమంది. తాజాగా అలాంటివారిపై హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ మండిపడింది.

 

రుక్సార్ థిల్లాన్.. ఆకతాయి అనే సినిమాతో ఈ చిన్నది ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కృష్ణార్జున యుద్ధం, ఏబీసీడీ, అశోకవనంలో అర్జున కళ్యాణం, నా సామీ రంగా లాంటి సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.  హిట్స్ దక్కపోయినా.. సోషల్ మీడియాలో నిత్యం కుర్రకారును కిర్రెక్కించే ఫొటోలను షేర్ చేస్తూ ఫేమస్ అయ్యింది. తాజాగా ఈ భామ నటిస్తున్న చిత్రం దిల్ రుబా.

 

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న దిల్ రుబా సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. మార్చి 14 న ఈ సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

Allu Arjun: నా భార్య నువ్వు చచ్చిపోయినా పర్లేదు అంది.. స్నేహ గురించి బన్నీ సంచలన వ్యాఖ్యలు

 

ఇక దిల్ రుబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రుక్సార్ తాను ఒక మంచి మెసేజ్ ఇచ్చింది. హీరోయిన్ల ఫోట్లను అసభ్యకరంగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని, అది తనకు ఎంత మాత్రం నచ్చలేదని చెప్పుకొచ్చింది. అయితే తనను అలా ఫోటోలు తీసిన వ్యక్తుల పేర్లు చెప్పడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. ” ఇక్కడ లేడీస్ ఎంతమంది ఉన్నారు. నేను ఇలా చెప్తున్నాను అని ఏమి అనుకోకండి.మీరందరూ ఫోటోలు దిగుతారు కదా. ఆ సమయంలో మీకు అన్ కంఫర్టబుల్ గా అనిపిస్తే.. ఎవరైనా మీ ఫోటోలు అన్ కంఫర్టబుల్ గా తీస్తే అది మీకు ఓకేనా.. ? లేదు కదా. ఎవరైనా వేదికపై అసౌకర్యంగా ఉన్నప్పుడు, వారు ఉద్దేశపూర్వకంగా ఫోటోలు తీసి వేరే ఉద్దేశ్యంతో పోస్ట్ చేస్తున్నారు.

 

నా సినిమా దిల్ రుబా మీద నాకు చాలా ప్రేమ ఉంది.  ప్రేమతో, మర్యాదతో చెప్తున్నాను.. దయచేసి అలాంటి ఫోటోలు తీయకండి అన్నాను. అది తప్పా.. ? రైటా..? అయినా కూడా వాళ్లు వినిపించుకోలేదు. వారి పేర్లు నేను చెప్పను. ఈ మెసేజ్ వారికి చేరుతుందని అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.