Last Updated:

Kangana Ranaut: జావేద్‌ అక్తర్‌తో కంగనా రనౌత్‌ – ఐదేళ్ల వివాదానికి ముగింపు!

Kangana Ranaut: జావేద్‌ అక్తర్‌తో కంగనా రనౌత్‌ – ఐదేళ్ల వివాదానికి ముగింపు!

Kangana Ranaut and Javed Akhtar: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌, రచయిత జావేద్‌ అక్తర్‌ మధ్య ఐదేళ్ల క్రితం వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ మరణం తర్వాత వీరిద్దరు ఒకరిపై ఒకరు వివాదస్పద వ్యాఖ్యలు, ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పచ్చి గడ్డి వస్తే మండే అంత వాగ్వాదం నెలకొంది. ఈ విషయమై వీరు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తాజాగా ఈ వివాదానికి చెక్‌ పడింది.

తాజాగా జావేద్ అక్తర్‌ను కలిసి ఆయనతో దిగిన ఫోటోను షేర్‌ చేసి ఈ వివాదానికి ముగింపు పలికింది కంగనా. ఈ ఫోటోని షేర్‌ చేస్తూ.. ” మధ్యవర్తిత్వంతో ఈ రోజు మా సమస్యను పరిష్కరించుకున్నాం. ఈ మీటింగ్‌లో జావేద్‌తో ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. భవిష్యత్తులో నేను దర్శకత్వం వహించబోయే సినిమాలకు ఆయన పాటలు కూడా రాస్తానన్నారు” అని కంగనా తన పోస్ట్‌కు రాసుకొచ్చింది.

2020లో యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఆయన మరణంతో డ్రగ్‌ కేసు బయటకు వచ్చింది. ఆయన మరణాంతరం కంగనా బాలీవుడ్‌లో నెపోటిజం అంశాన్ని లెవనెత్తారు. ఇండస్ట్రీలో బంధుప్రీతి ఏ స్థాయిలో ఉందో, దానివల్ల బయటి వారు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో తరచూ మాట్లాడుతూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది.

ఈ క్రమంలో హీరో హృతిక్ రోషన్‌తో వివాదాన్ని కూడా లెవనెత్తింది. ఈ వ్యవహారంలో జావేద్ అక్తర్‌ మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం చేశారని మాట్లాడింది. ఈ విషయమైన ఆయన తనని ఇంటికి పిలిచి మరీ బెదిరించారని చెప్పింది. తన వ్యాఖ్యలను ఖండిస్తూ జావేద్‌ అక్తర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఆ తర్వాత నేరపూరిత కుట్ర, గోప్యతకు భంగం కలిగించడం వంటి ఆరోపణలతో అక్తర్‌పై కంగన క్రాస్‌ పటిషన్‌ కూడా వేశారు.