Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్దుల ఖరారు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 8 నెలల ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, అనంతపురం-కడప-కర్నూలుకు అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాల్‌రెడ్డి
Andhra Pradesh: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు 8 నెలల ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. వచ్చే ఏడాది మార్చిలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, అనంతపురం-కడప-కర్నూలుకు అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాల్‌రెడ్డి కుమారుడు వెన్నుపూస రవీంద్రరెడ్డి, చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి పేర్లను ఖరారు చేశారు.
ఎమ్మెల్సీల ఎంపికకు సంబంధించి ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత సీఎం జగన్ వీళ్లను ఖరారు చేశారు. అయితే ఉపాధ్యాయుల కోటాలో వచ్చే ఎమ్మెల్సీ పదవులకు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.